అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడుతుంటారు. అయితే పని ఒత్తిడి,
అలసట, సమయాభావం వంటి కారణాలతో తగిన పోషణ తీసుకోలేకపోతుంటారు. తరచూ
సౌందర్యశాలకు వెళ్లి మెరుగులు దిద్దుకోవాలంటే కష్టమైన విషయమే. అలాంటప్పుడు
ఇంట్లోనే ఉంటూ అందుబాటులో ఉండే కొబ్బరి పాలతో మేని మెరుపునకు
ప్రయత్నించవచ్చు. కొబ్బరి ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. దాని నుంచి తీసిన
పాలు ఔషధ గుణాల మిళితం వాటిని ఆహాంరంలోనే కాదు...ఆరోగ్యాన్ని అందాన్ని
ద్విగుణీకృతం చేసేందుకూ వాడితే..ప్రకాశవంతమైన చర్మం, ఆరోగ్యవంతమైన శరీరం మీ
సొంతమవుతుంది.
ఇది స్వర్గంలాంటి ఉష్ణమండల సువాసన అందించడమే కాకుండా, ఇది మీ జుట్టును
డార్క్ గా సుతిమెత్తగా ఉంచుతుంది. ముఖ్యంగా ఇది తేమ లక్షణాలను కలిగి
ఉంటుంది. రసాయనికంగా-స్ట్రెయిట్ మరియు సహజంగా జుట్టు పెరగటానికి మరియు
గట్టిగా ఉండటానికి కావలసిన తేమను అందిస్తుంది. కొబ్బరి నూనె కేశాలను
పొడవుగా ఉంచుతుంది మరియు లోపలినుండి ఉన్న కుదుళ్ళను సమానంగా
ఉంచుతుంది,ఎందుకంటే ఇది కేశాల నిర్మాణంతో పోలి ఉంటుంది. దీనిని మీరు షాంపూ
చేయబోయే ముందు హెయిర్ ఆయిల్ ట్రీట్మెంట్ లాగా ఉపయోగించవొచ్చు. మీ చేతినిండా
నూనెను తీసుకొని తలపై నుండి కేశాల చివరి వరకు మెల్లిగా అంతటా రుద్దండి
మరియు ఒక గంట తరువాత కడగండి. మీ కేశాలు ఎప్పుడూ చూడనంత మృదువుగా,
కాంతివంతంగా తయారవుతాయి. ఇక దురదలు ఉండవు! కొబ్బరి నూనె, దురదలు మరియు
చుండ్రు మరియు పేను వంటి వాటిని నివారించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇవి
జుట్టుకు పోషణ అంధించడంతో పాటు, కొబ్బరిపాలు లేదా కొబ్బరి నూనె జుట్టు
పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఇంకా కేశాలు సాఫ్ట్ గా మరియు షైనీగా
తయారుచేస్తుంది.
అందంగా తేలియాడే కురులు సొంతం కావాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే వివిధ
కారణాల వల్ల జుట్టు రాలిపోతుంటుంది. ఇలాంటి సమస్యలెదురైనప్పుడు కొబ్బరి
పాలతో చికిత్స ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి పాలల్లో రెండు చుక్కల బాదం
నూనె కలిపి తలంతా రాసుకోవాలి. ఆ మిశ్రమంలో సహజంగా ఉండే పొటాషియం, పోలేట్ తో
పాటూ ఇతర ఖనిజాలు కురులకు అంది ఆరోగ్యంగా మారతాయి. అలాగే హెన్నా
చేసుకొనేప్పుడు కొబ్బరి పాలు కలిపితే జుట్టు మెరుస్తుంది. ఒత్తుగా
మారుతుంది.
కొబ్బరి పాలు మీ కేశాలను బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. కొబ్బరి పాలు ఒక
పాతకాలపు వంటింటి చిట్కా . పచ్చి కొబ్బరి పాలను మీ తలకు మరియు మీ జుట్టుకు
కూడా అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.
కోకోనట్ మిల్క్ అండ్ లెమన్: ఒక బౌల్ తీసుకొని అందులో కొబ్బరి పాలు,
నిమ్మరసం సమభాగాల్లో తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు,
కేశాలకు బాగా పట్టించి, వేడినీళ్ళలో ముంచిన టవల్ ను తలకు చుట్టుకోవాలి. ఇలా
ఒక గంట ఉండనిచ్చి తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా వారానికి ఒక మూడు
సార్లు తప్పనిసరిగా చేస్తుంటే మీరు కోరుకున్న జుట్టు మీకు నచ్చే ఆకారంలో
ఉంటాయి.

No comments:
Post a Comment