ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫరూఖ్ షేక్ శుక్రవారం రాత్రి దుబాయ్‌లో
గుండె పోటుతో మరణించారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. ఫరూఖ్ మరణించినట్లు
కుటుంబసభ్యులు ధృవీకరించారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. దుబాయ్ నుంచి
ఆయన మృత దేహాన్ని ముంబై తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
1970, 1980ల్లో ఫరూఖ్ పలు చిత్రాల్లో ముఖ్య మైన పాత్రలు పోషించారు.
‘శత్రాంజ్ కి కిలాడీ', ‘చష్మే బద్దూర్', ‘కిసి సె నా కెహ్నా', ‘నూరీ'
చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఆయన నటించిన చివరి
చిత్రం ‘క్లబ్ 60'. దీనికంటే ముందు ఆయన ‘యే జవానీ హై దివానీ' చిత్రంలో
రణబీర్ కపూర్ తండ్రిగా నటించారు.
గుండెపోటు: దుబాయ్‌లో బాలీవుడ్ నటుడు మృతి
ఫరూఖ్ షేక్
సినిమాలతో పాటు పలు అనేక టీవీ సీరియల్స్, టీవీ కార్యక్రమాల్లో కూడా ఫరూఖ్
షేక్ నటించారు. బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ సంస్థల తరుపున ఆయన పని చేసారు.
జీటీవీలో గతంలో ప్రసారమైన "Jeena issi ka naam hai" ద్వారా ఆయన ఎంతో మంది
బాలీవుడ్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసారు.

No comments:
Post a Comment