Monday, December 30, 2013

ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించే సూపర్ ఫుడ్స్

 ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. నిద్రలేమి, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు,
పార్టీ కల్చర్స్, ఒత్తిడి వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. ఈ రోజులలో ఒత్తిడి అనే మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపిస్తోంది. ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లను కూడా ఒక దశకు వచ్చే సరికి నియంత్రణ చేయాలి.. చిన్నప్పుడు ఇష్టంగా తిన్నామని... పెద్దయ్యాక కూడా వాటిని అదేలా తింటామంటే కుదరదు. ముఖ్యంగా ఆడవారి విషయంలో సమతుల ఆహారం తీసుకోవాలి. ఎక్కువశాతం ఒత్తిడికి గురయ్యే విషయంలో పురుషుల కన్నా మహిళలే ముందు వరుసలో ఉంటున్నారని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. ఇలా మద్యలో వచ్చే అనేక రకాలా అనారోగ్యసమస్యలను ఎదుర్కోవాలంటే , వాటిని ముఖ్య కారణాలు కనుగొని జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. మీరు తీసుకొనే ఆహారం,మీరు అనుకొన్నదాని కంటే చాలా గొప్పగా ప్రభావం చూపెడుతాయి అన్న విషయం మీకు తెలుసా?ఇక్కడ కొన్ని ఆహారాలను లిస్ట్ చేయబడి ఇస్తున్నాం.


No comments:

Post a Comment