ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం అనేది, ఆరోజుకు అత్యంత
ముఖ్యమైనటువంటి భోజం(మీల్). ఎట్టిపరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్ ను
మానకూడదు. ఉదయం తీసుకొనే ఆహారం ఏదో ఒకటి తినాలని అంటుంటారు. ఇంకా బ్రేక్
ఫాస్ట్ ను కింగ్ లా తినాలి అంటారు. అయితే ఎంత మంది ఇలా చేస్తారు?బ్రేక్
ఫాస్ట్ ను దాటవేయడానికి అనేక కారణాలను చెబుతుంటారు. బ్రేక్ ఫాస్ట్ ను
తినకపోవడం వల్ల మనంతట మనం మన శరీరాన్ని, ఆనారోగ్యానికి గురిచేస్తుంటాం.
పెద్దలు కానీ, పిల్లలు కానీ, ముఖ్యంగా మహిళలు బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం చాలా
చెడ్డ అలవాటు. ఎందుకంటే, ఎప్పైడైతే మనం బ్రేక్ ఫాస్ట్ ను దాటవేస్తామో,
అప్పుడు మన శరీరంలో శక్తి తగ్గిపోతుంది. జీవక్రియలు ఆలస్యం అవుతాయి. అది మన
శరీర ఆరోగ్యానికి మంచిది కాదు.
మీరు లేట్ గా నిద్రలేవడం మరియు బ్రేక్ ఫాస్ట్ ను తినకపోవడం, వంటివి రొటీన్
గా ఉన్నట్లైతే, వెంటనే మీరు ఈ పద్దతిని మార్చుకోవాలి. మీరు డైట్ లో
ఉన్నప్పుడు, మీరు ఖచ్చితంగా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవడానికి
ప్రయత్నించాలి. మీరు లాస్ట్ మీల్స్ తీసుకొన్న 7-8గంటల తర్వాత బ్రేక్ ఫాస్ట్
తీసుకోవడం చాలా అవసరం. ఆ ఏడు, ఎనిమిది గంటల్లో మీరు కోల్పోయిన ఎనర్జీని
తిరిగి పొందడానికి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. మరియు
అవసరం. అయినా కూడా మీరు ఇప్పటికీ బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయాలని చూస్తుంటే,
దాని వల్ల ఎదురయ్యే సమస్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి వాటిని
పరిశీలించండి...

No comments:
Post a Comment