Wednesday, January 8, 2014

ఆయిల్ & సెన్సిటివ్ స్కిన్ నివారించే సెన్సిటివ్ స్కిన్

మీరు జిడ్డు చర్మంతో అలసిపోయారా? అయితే, ఆయిల్ స్కిన్ ను నివారించ సమయం వచ్చింది. ఆయిల్ స్కిన్ లేకుండా ఒక క్లియర్ స్కిన్ పొందాంలే తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందే. జిడ్డు చర్మం కలిగి వారు, ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల మీ చర్మం మరింత ఆయిలీగా మారుతుందని అటువంటి ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉపయోగించకూడదని మీరు వినే ఉంటారు. కానీ, ఈ రోజు కొందరు బ్యూటీషియన్ నిపుణుల ప్రకారం, ఆయిల్ చర్మానికి ట్రీట్ చేయడానికి ఫేషియల్ ఆయిల్ ఉపయోగిస్తే సమస్య శాశ్వతంగా నివారించవచ్చు అని అంటున్నారు. అటువంటి ఫేషియల్ ఆయిల్ కొన్ని మీకోసం ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఎవరైతే సెన్సిటివ్ స్కిన్ కలిగి ఉన్నారో వారు కూడా ఈ ఫేషియల్ ఆయిల్స్ ను ఉపయోగించవచ్చు. ఈ ఫేషియల్ ఆయల్స్ చర్మ సమస్యలను నివారిస్తాయి . మీ సున్నిత చర్మానికి సరైన, మన్నికైన ఆయిల్ ను ఉపయోగించడం వల్ల మీ చర్మానికి తగినంత తేమను అంధించడంతో పాటు, మొటిమలు లేని చర్మాన్ని ఇవ్వడంతో పాటు సెబమ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ ను కొన్ని మొక్కలు, వేర్లు మరియు పువ్వులనుండి సేకరించబడినది. ఈ ఆయిల్స్ చర్మాన్నికి సున్నితత్వాన్ని మరియు మొటిమలు మచ్చలు లేని చర్మ తత్వాన్ని అంధిస్తుంది . మీకు ఆయిల్ స్కిన్ ఉన్నా, లేకున్నా ఇది చర్మానికి అద్భుతంగా పనిచేసి, మంచి ప్రయోజనాలను అంధిస్తుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఈ నేచురల్ ఆయిల్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మంలోని చాలా తేలికగా శోషింపబడి చర్మ రంద్రాల నుండి శుభ్రం చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

No comments:

Post a Comment