Sunday, April 13, 2014

నిర్లక్ష్యం చేయకూడం మంచిది కాదు...

శరీరంలో అతి కీలకమైన అవయవం కాలేయం. ఆహారం అరగాలన్నా, తిన్నది ఒంటబట్టాలన్నా కాలేయం పనితీరు బాగుండాలి. అలాంటి కీలకావయవంలో
కొవ్వు అధికంగా చేరిపోతే ఫ్యాటీలివర్ సమస్య మొదలవుతుంది. ఆ సమస్యను అలాగే నిర్లక్ష్యంగా వదిలేస్తే లివర్ సిర్రోసిస్‌గా మారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే కాలేయ సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని అంటున్నారు వైద్యులు. కారణాలు: కలుషితమైన నీరు తాగడం, రోజూ తినే ఆహార పదార్థాలలో మార్పు, ఆల్కాహాల్‌, స్మోకింగ్‌ తదితర దురలవాట్ల వల్ల మనలో చాలా మంది వారికి తెలియకుండానే లివర్‌ సంబంధిత వ్యాధులకు చేరువవుతున్నారు. ఫ్యాటీ లివర్ సమస్య చేజేతులా కొనితెచ్చుకుంటున్నదే. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో ఫ్యాటీలివర్ సమస్య కనిపిస్తోంది. నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, చిప్స్, బర్గర్స్ వంటి జంక్‌ఫుడ్స్ తినడం, ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం, సమయపాలనలేని భోజనం, ఆహారపు అలవాట్లలో మార్పులు కాలేయవాపుకు కారణమవుతున్నాయి. డయాబెటిస్ మూలంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం కూడా ఉంది. మరి లివర్ డ్యామేజ్ అయిందని తెలిపే కొన్ని సాధారణ లక్షణాలు: నిర్లక్ష్యం చేయకూడని 6 లివర్ డ్యామేజ్ లక్షణాలు 1/7 వికారం మరియు వాంతులు అజీర్ణం, కాలేయం దెబ్బతినడంతో ఆమ్ల ప్రభావంతో తలతిరిగేటట్టు ఉండడం వంటి జీర్ణ సమస్యలు కూడా వాంతులకు దారితీస్తాయి.


No comments:

Post a Comment