Thursday, April 17, 2014

ఎముకలు బలంగా ఉండలంటే ...


 సాధారణంగా పిల్లలు చిన్నప్పటి నుండి తల్లులు వారి పిల్లలకు ప్రత్యేకమైన ఆహారాలు అందిస్తుంటారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, వారిపెరుగుదలకు సహాయపడే
ఎముకలు బలంగా ఉండాలని హెల్తీ ఫుడ్ అందిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది పెరిగే పిల్లలతో పాటు, పెద్దలు కూడా ఎముకలకు సంబంధించి ఆరోగ్య సమస్యలతో బాధపడుతన్నట్లు అనేక అద్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. నిపుణుల ప్రకారం, ఈ ఎముకల ఆరోగ్యానికి సంబంధించినంత వరకూ సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడమే అందుకు కారణం అని చెబుతున్నారు. ఎముకలను ఆరోగ్యంగా ఉంచే కొన్నిముఖ్యమైనటువంటి ఆహారాలను తమ రెగ్యులర్ డైట్ లో శరీరంలో ఎముకలో స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎముకల అభివ్రుద్దికి, మరియు స్ట్రాంగ్ గా ఉండటానికి సహాయపడే కొన్ని ఆహారాలను బోల్డ్ స్కై మీకోసం అందిస్తోంది. మీ వయస్సు ప్రకారం, వయస్సు పెరిగే కొద్ది, ఎముకల్లో కాల్షియం తగ్గడం వల్ల కూడా బోన్ కు సంబంధించి సమస్యలు అధికం అవుతాయి. కాబట్టి, నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెద్దవారు కొన్ని ముఖ్యమైన ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం తప్పనిసరిగా గుర్గించుకోవాలి. అలా చేసినప్పుడు, వయస్సు పెరిగేకొద్ది ఎటువంటి అనారోగ్య సమస్యలుండవు. శరీరంలో జీవక్రియలు క్రమంగా పనిచేయడానికి కాల్షియం చాలా అవసరం. మరియు కాల్షియం ఎముకల్లో నిల్వచేరడం చాలా అవసరం. అలా ఎముకల్లో కాల్షియం చేరాలంటే, అందుకు మనశరీరానికి విటమిన్ డి చాలా అవసరం. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో క్యాల్షియం ఉన్నటువంటి ఆహారాలు సరైనా మోతాదులో తీసుకోకపోతే, ఎముకలు చిట్లడం, ఎముకలు అరిగిపోవడం వంటి బోన్ సమస్యలు ఎర్పడుతాయి. మరి ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాలంటే ఈక్రింది స్లైడ్ లో కొన్ని బోన్ బిల్డింగ్ ఫుడ్స్ లిస్ట్ ను అంధిస్తున్నాం. ఈ క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

పాలు:  
కాఫీ మరియు టీ లను తాగడం సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. కాఫీ, టీలకు బదులుగా ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. మరియు పాల వల్ల కాల్షియం అందుతుంది. మరియు ఎముకలకు అవసరమయ్యే ఇతర విటమిన్ డి తో పాటు, ప్రోటీన్, ఫాస్పరస్, మరియు పొటాషియం వంటివి పుష్కలంగా అందుతాయి.

No comments:

Post a Comment