Tuesday, April 29, 2014

మామిడికాయ-పుదీనా చట్నీ

వేసవికాలంలో ఎండ, వేడి వల్ల శరీరం నీటిని కోల్పోయి డీహైడ్రేషన్ అయి, బాడీ కూడా వేడి చేస్తుంది . అటువంటి పరిస్థితిలో మీ శరీరానికి చల్లదనాన్ని కలిగించే
ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. సమ్మర్ హీట్ ను బీట్ చేయడానికి కూలింగ్ పదార్థాలు ఎంపిక చేసుకోవాలి. శరీరానికి చల్లదనం కలిగించే అటువంటి ఆహారాల్లో పుదీనా ఒకటి . సమ్మర్ డైట్ లో తప్పనిసరిగా పుదీనా చేర్చుకోవడం ఒక బెస్ట్ ఐడియా. మరి వేసవిలో విరివిగా లభించే పచ్చిమామిడి మరియు పుదీనా కాంబినేషన్ లో పుదీనా చట్నీ తయారుచేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. దీనికి వెల్లుల్లి రెబ్బలు మరింత టేస్ట్ ను అందిస్తాయి. మరియు మీ శరీరాన్ని కూల్ గా ఉంచుతాయి. మరి ఈ స్పెషల్ మ్యాంగ్, మింట్ చట్నీ ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు:
 పచ్చిమామిడికాయ : 1(మీడియం సైజ్) పుదీనా: 1కట్ట వెల్లుల్లి రెబ్బలు: 4 బ్లాక్ సాల్ట్: 1/2tsp పచ్చిమిర్చి: 3 జీలకర్ర పొడి: 2tsp ఉప్పు: రుచికి సరిపడా 
తయారుచేయు విధానం: 
1. ముందుగా పచ్చిమామిడికాయను శుభ్రంగా కడిగి తేమ తుడిచేసి, పీలర్ తో పొట్టు తీసి, ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి 
2. తర్వాత పుదీనా ఆకులను విడిపించి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 
3. తర్వాత పచ్చిమామిడికాయ ముక్కలు, పుదీనా ఆకులు మరియు వెల్లుల్లి రెబ్బులు అన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. 
4. కొద్దిగా నీళ్ళు కలుపుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోనికి మార్చుకొని దానికి ొకద్దిగా ఉప్పు, జీలకర్ర వేసి మిక్స్ చేసుకోవాలి 5. అవసరం అయితే పోపు పెట్టుకోవచ్చు లేదా అలాగే కూడా తినవచ్చు. ఉప్ప సరిచూసుకొని సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో మింట్ చట్నీ రెడీ . ఈ కూలింగ్ చట్నీని మీల్స్ లేదా స్నాక్స్ తో తిని ఎంజాయ్ చేయవచ్చు.

No comments:

Post a Comment