Thursday, May 8, 2014

చాందినీ శర్మ సందడి

నగరంలోని ఆబిడ్స్ తిలక్‌రోడ్‌లోని న్యూ మార్కెటింగ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ‘ఇకత్ హ్యాండ్‌లూమ్ మేళా-2014'ను ఇండియన్ ప్రిన్సెస్ విజేత
చాందినీ శర్మ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాచీన భారతీయ సంస్కృతిలో ప్రత్యేకత కలిగిన హ్యాండ్ లూమ్ ఉత్పత్తులకు నేటికీ వన్నె తగ్గలేదని అన్నారు. ఫ్యాషన్ ప్రియుల కోసం మేళాను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇక టాలీవుడ్‌లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని చాందినీ శర్మ తెలిపారు. పోచంపల్లి, సిల్క్స్, వీవర్లు మేళాలో ఏర్పాటు చేశారు. పోచంపల్లి, ఇకత్ లతోపాటు కలంకారి చీరలు, సూట్స్, బెడ్ షీట్స్, టేబుల్ లెనిన్, హ్యాండ్ బ్యాగ్స్ వందల రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంచామని నిర్వాహకులు దేవేందర్ తెలిపారు. ఈ ప్రదర్శన మే 17వ తేదీ వరకు కొనసాగుతుందని దేవేందర్ తెలిపారు.
చాందినీ శర్మ హైదరాబాద్‌‌లోని ఆబిడ్స్ తిలక్‌రోడ్‌లోని న్యూ మార్కెటింగ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ‘ఇకత్ హ్యాండ్‌లూమ్ మేళా-2014'ను ఇండియన్ ప్రిన్సెస్ విజేత చాందినీ శర్మ బుధవారం ప్రారంభించారు.

No comments:

Post a Comment