అందంగా, ట్రెండీగా కనిపించాలంటే.. నెట్టెడ్ శారీసే బెస్ట్ ఛాయిస్..
ప్రస్తుతం హవా మొత్తం నెట్ శారీస్‌దే.. కాలేజీ అమ్మాయిల దగ్గరి నుండి
రిటైర్డ్ ఉద్యోగినుల వరకు ప్రతి ఒక్కరూ వీటిపై మక్కువ చూపుతున్నారు.అందునా
స్పెషల్ డిజైన్ల పట్ల మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఇచ్చిన నెట్ శారీస్
కూడా ఆ కోవకే చెందుతాయి. వనితా లోకంలో ఆకర్షణను పెంచి వనితల అందాలను పెంచే
చీరలు క్రొత్తగా ఇప్పుడు ఎక్కువ వాడకం అయిపోయాయి. ఇవే ఈ నెట్టెడ్ శారీస్!
పట్టుకుంటే జారిపోయే విధంగా అందంగా ఉంది, ప్రస్తుత ట్రెండ్ లో పట్టుచీరలను
మించి మురిపిస్తున్నాయి ఈ వల చీరలు.
ప్రధానంగా కట్టుకుంటే ఒంటికి అంటి పెట్టుకుపోయేవిధంగా కనిపించడం ఈ చీరల
ప్రత్యేకత. లేత, ముదురురంగుల లో ఈ చీరలు లభిస్తూ దాదాపు అన్నీ షాపుల్లో
సులభంగా లభ్యమవుతూ మహిళలను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రెండింటి కలబోత
వర్ణాలతో ఒయ్యారాలు పోతూ మగువల మనసులను తమ వలలో చిక్కుకునేలా
చేస్తున్నాయి!
No comments:
Post a Comment