చలికాలం వాతావరణంలో తేమశాతం తక్కువగా ఉండటం వల్ల చర్మం పొడిబారి పోతుంది. దాంతో పగుళ్లు రావడం, దురదలు వంటి సమస్యలు చాలామందిని వేధిస్తాయి. దీనికి పెట్రోలియమ్ జెల్లీ, బాడీ లోషన్ రాయడం వల్ల చాలా మందికి సమస్య తీరిపోతుంది. అయితే కొద్దిమందిలో చర్మ సమస్యలు తీవ్రంగా మారతాయి. చలికాలం వచ్చే చర్మసమస్యల్లో ప్రధానమైనది ఎగ్జిమా. దీన్నే డర్మటైటిస్ అంటారు. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి ‘ఎటోపిక్
డర్మటైటిస్' వంశపారంపర్యంగా రావడంతో పాటు చలికాలంలో తీవ్రరూపంలో వస్తుంది. తొలిదశలో చర్మం పొడిగా మారి ఎర్రగా అవుతుంది. కాలం నడిచే కొద్దీ నీటిపొక్కులు రావడం, గీరడం వల్ల రక్తం కారడం, చీము పట్టడం వంటి సమస్యలు వస్తాయి. ఇంకాస్త వ్యాధి ముదిరినప్పుడు చర్మం నల్లగా, మందంగా మారి, పగుళ్లు ఏర్పడి రక్తం వస్తుంది. ముఖంనకు గ్లిసరిన్ ఉపయోగించడం ఎలా?:క్లిక్ చేయండి సోరియాసిస్ అనే ఆటో ఇమ్యూన్ సమస్యకూడా చలికాలంలో ఎక్కువవుతుంది. చర్మంపైన ఉన్న కణాలు త్వరితంగా పరిపక్వమై, కణవిభజన వేగంగా పెరగడం వల్ల మామూలుకంటే ఐదు రెట్లు ఎక్కువగా జరుగుతుంది. దాంతో చర్మం పొట్టులా పొలుసులుగా రాలుతుంది. ఈ స్థలంలో చర్మం ఎర్రగా తేమగా అవుతుంది. అయితే ఇదే సమయంలో వాతావరణంలో మార్పుల వల్ల సమస్య జటిలం అవుతుంది. చాలా మందిలో చర్మం పొట్టుగా రాలిపోవడం మోచేతులు, మోకాళ్లలో ఎక్కువ. చలి కాలం లో ఉండే విపరీతమైన చలి వాళ్ళ చర్మం పగిలి అంధవికారంగా తయారు అవుతుంది. పొడిబారిన చర్మాన్ని మరల మునపటిలా కాంతి పొందాలంటే కోల్డ్ క్రీమ్ బాగా పనిచేస్తుంది. మరి కోల్డ్ క్రీమ్ తో కలిగే ప్రయోజనాలేంటో? ఎలా ఉపయోగించాలో చూద్దాం...
1. నైట్ ఫేస్ మాస్క్: రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటిలో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రపరచుకుని, బ్రాండెడ్ కోల్డ్ క్రీమ్ లేడా మాయిశ్చైజర్ ను రాసుకోండి. చలికాలంలో క్రమం తప్పకుండా ఇలా చేస్తే మీ చర్మం పొడిబారకుండా ఉంటుంది. .రాత్రి పడుకునే ముందు కోల్డ్ క్రీమ్ ని తప్పనిసరిగా రాసుకుని పాడుకోవాలి.ఇలా క్రమం తప్పకుండ చేస్తే మంచి తేడా గమనించవచ్చు.చలికాలంలో దాదాపు చర్మంలో నూనె ఉత్పత్తి శాతం తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే చర్మం పొడిబారిపోవడం, ముడతలు పడటం, పొలుసులుగా కనిపిస్తుంటుంది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేవారు వారానికోసారి ఎక్స్ ఫొలియేట్ తప్పకుండా చేసుకోవాలి. ఈ చర్య వల్ల చర్మంలో పేర్కొన్న మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. చలికాలంలో ప్రతిరోజు స్నానానికి ముందు కొబ్బరినూనెను ఒంటికి పట్టించి గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయండి.
2. లిప్ బామ్: పెదాలు ఎక్కువ పగిలి పోతాయి ఈ కాలంలో .రాత్రి పడుకునే ముందు పెదాలకు మీగడ లేదా వెన్న రాసుకున్న మేత్తబడతాయి. చలికాలంలో పెదవులు పగిలిపోయినట్లు అనిపిస్తే... నాలుకతో తడి చేసుకోకూడదు. అలా చేస్తే పెదవులు ఎండిపోయి చర్మం మొద్దుబారిపోతుంది. పెదవులు పగులకుండా ఉండాలంటే.. మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు. అలాగే రాత్రిపూట గులాబీ రేకుల రసాన్ని పెదవులకు రాసుకుని పడుకున్నట్లయితే.. పెదవులు పగలకుండా ఉంటాయి. గులాబీ రేకుల రసం అందుబాటులో లేనట్లయితే కోల్డ్ క్రీమ్ కూడా వాడవచ్చు.
3. మోచేతులు-మోకాళ్ళపై శ్రద్ద: చలికాలంలో చలి పెరిగే కొద్ది చేతులపైన కాళ్ళపైన పగుళ్ళు అధికంగా ఏర్పడుతాయి. ఇప్పుడు కనుక సరైజ జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత ముడుతలు, చర్మం మీద గీతలు అలాగే ఉండిపోతాయి. కాబట్టి కాళ్ళు చేతులకు కూడా కోల్డ్ క్రీమ్ రాయండి.
4. పాదాల పగుళ్ళు: ఈ సమయం లో పాదాలు కూడా బాగా పగులుతాయి అందువల్ల సండీల్స్ వేసుకున్న కూడా సాక్స్ లు తప్పని సరిగా వేసుకోవాలి. చలికాలంలో పాదాలు పగులుతుంటాయి. ఈ పగుళ్లు తగ్గాంటే.. అరకప్పు కొబ్బరి నూనెలో 10వేపాకులు, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం వేసి మరిగించి, చల్లారిన తర్వాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా రెండు వారాల పాటు పాదాలకు రాసుకుంటే పగుళ్ళు తగ్గి సున్నితంగా తయారవుతాయి.
5. చేతులు మరియు బాడీ లోషన్: ఫేస్ క్రీములు, బాడీలోషన్ల గురించి చాలా మందికి తెలుసు. తెలియని వారుంటే వారు, చలికాలంలో కోల్డ్ క్రీమ్ రాయడం వల్ల శరీరానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. 6. షేవింగ్ క్రీమ్: చలికాలంలో మగవారికి కూడా పనిచేసే ఆడువారి కాస్మోటిక్స్ ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే షేవింగ్ క్రీమ్ కు బదులు కోల్డ్ క్రీమ్ ను ఉపయోగించడం వారి చర్మ సంరక్షణకు చాలా మంచిది.

No comments:
Post a Comment