అమ్మాయి అందంగా కనబడాలంటే శిరోజాల దగ్గర్నించి పాదాల వరకూ జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అసలే చలికాలం...మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెదువులు పొడిగా అయిపోవడం, పగలడం..వంటివి జరుగుతూ ఉంటాయి. అంతమాత్రాన బాధపడాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే ఇంట్లో అభించే పదార్థాలతోనే తిరిగి వాటిని సాప్ట్ గా మార్చేయవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా... చలికాలంలో పెదవులు పగలడానికి కేవలం చల్లగాలులే కారణం కాదు, విటమిన్ ఇ లోపం, శరీరంలోని తేమ శాతం తగ్గడం, పొగతాగడం, అలాగే పెదవులను తరచూ నాలుకతో తడి చేసుకుంటూ ఉండటం...ఇలా అనేక అంశాలు కూడా అందుకు దోహదం చేస్తాయి. అయితే ఈ సమస్యకు ఇంట్లో లభించే వస్తువులతోనే స్వస్తి చెప్పి, సాఫ్ట్ గా ఉండే అదరాలను సొంతం చేసుకోవచ్చు.
పంచదార
రెండు చెంచాలా పంచదార, చెంచా తేనె జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకుని కొన్ని నిమిషాలు అలానే ఉంచాలి. తర్వాత వేళ్ల చివర్లతో పెదవుల చుట్టూ మెల్లగా రుద్దాలి. ఇప్పుడు గోరువెచ్చిని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా చేయడం వల్ల పై పొరల్లో ఉండే మృతకణాలు తొలగిపోతాయి. ఫలితంగా పెదవులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.
No comments:
Post a Comment