Friday, March 6, 2015

ఇండో-బ్రిటీష్ మోడల్ కమ్ సింగర్ సోఫియా హయాత్ హోలీకేళీ!

ఇండో-బ్రిటీష్ మోడల్ కమ్ సింగర్ సోఫియా హయాత్ బాలీవుడ్ లో తన ప్రస్థానం ఏర్పరుచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ.. ఫలితం మాత్రం దక్కలేదు. రెండు, మూడు టీవీ షోలలో నటించిన ఈ అమ్మడు..
ఆమధ్య ఒక సినిమాలో తళుక్కుమంటూ మెరిసింది. అయితే.. అది ఆమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. బిగ్ బాగ్-7లో పార్టిసిపేట్ చేసినప్పటికీ.. ఆ షో ఈమె కెరీర్ కి అంతగా హెల్ప్ అవ్వలేదు.

దీంతో ఇక చేసేదేమీలేక ఈ భామ అప్పుడప్పుడు చిట్టిపొట్టి డ్రెస్సులు ధరిస్తూ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. బికినీలు వేసుకుంటూ ఫోటోలకు పోజులిచ్చి యువకులను రక్తి కట్టిస్తుంటుంది. ఆమధ్య ఐస్ బకెట్ ఛాలెంజ్ కోసం న్యూడ్ గా అవతారమెత్తింది కూడా! ఆ వీడియో అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. పబ్లిసిటీ కోసం మరీ నగ్నంగా పోజులివ్వడం ఏంటని ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక అప్పటినుంచి కాస్త సైలెంట్ గానే వుంటూ వచ్చింది. 

ఇప్పుడు హోలీ పండుగ సందర్భంగా ఈ అమ్మడు మరోసారి లో-దుస్తుల్లో కనువిందు చేసింది. మరీ చిన్నగా వుండే బికినీ దుస్తులు ధరించి, తనపై రంగులు వేసుకుంటూ హోయలొలికించింది. మునుపటికంటే ఈ సారి మరింత రంజుగా వుండేలా తన సెడెక్టివ్ అవతారాన్ని ప్రదర్శించింది. అందరికీ హోలీ శుభాకాంక్షలు అంటూ విషెస్ చెబుతోంది ఈ అమ్మడు. ఇప్పుడా ఫోటోలు ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. 

అన్నట్టు.. ఈ సెక్సీ భామ గతంలో క్రికెటర్ రోహిత్ శర్మతో ప్రేమాయణం నడిపింది కూడా! కొన్నాళ్లపాటు ఆ జంట చెట్టాపట్టాలేసుకుని బాగానే తిరిగింది. అయితే.. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. 

No comments:

Post a Comment