Monday, December 14, 2015

రొమాంటిక్ గా బరువు తగ్గించుకోవడానికి...

వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గించుకోవచ్చు. పౌష్టికాహారం తీసుకుంటూ శరీరంలో ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు...కానీ రొమాంటిక్ గా కానీ రొమాంటిక్ గా బరువు తగ్గడం గురించి మీరెప్పుడైనా..

ఎక్కడైనా విన్నారా...? ఏముంది..పాట్నర్స్ ఇద్దరూ కలిసి చేసే కొన్ని రొమాంటిక్ పనులు ద్వారా శరీర బరువును కంట్రోల్ చేసుకోవచ్చు అనుకుంటారందరు! అవును, ఖచ్చితంగా అది నిజమనే చెబుతున్నాయి కొన్ని హెల్త్ స్టడీస్.. శరీరంలో కొవ్వు తగ్గాలని శ్రమ పడుతున్న వారు, ట్రెడ్ మిల్స్, జోగింగ్ వంటివి తగ్గించలేకపోతున్నాయా? మరిక... కొత్త వ్యాయామం ఒకటి మొదలుపెట్టండి. అదే....రొమాంటిక్ క్రీడ! ఇకపై ట్రెడ్ మిల్, దూరం నడవటం, లేదా ఆహారం తగ్గించటం, మీ కిష్టమైన రుచులు కోల్పోవటం వంటివి చేయకండి. తాజాగా ఒక వ్యాయామ నిపుణుడు సూచించిన మేరకు దంపతులిద్దరు కలిసే చేసే వ్యాయామ క్రీడలు ఇద్దరి మద్య బందాన్ని బలపరచడం మాత్రమే కాదు బరువు తగ్గించే మార్గం కూడా ఇదే అంటున్నారు కొందరు పరిశోధకులు. రొమాటింక్ గా బరువు తగ్గడమనేది కేవలం భార్యాభర్తలిద్దరికి మాత్రమే సంబంధించిన అంశం. అది కలిసి వ్యాయామం చేయడం కావచ్చు.. మరే ఇతర పనుల ద్వారానైనా కావచ్చు...ఇలా రోజువారీ జీవితంలో ఇద్దరూ కలిసి చేసే కొన్ని పనులు, వ్యాయామాలు చేయడం వల్ల వారు మరింత ఫిట్ గా తయారవ్వడం మాత్రమే కాదు, ఇద్దరి మద్య అనుబంధం మరింత రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. మరి పాట్నర్స్ చేయగలిగే బరువు తగ్గించే రొమాటిక్ పనులేంటో తెలుసుకుందాం.

No comments:

Post a Comment