Friday, January 28, 2011

2011వ జంటగా నవనీత్ కౌర్ అండ్ రానా

ఆకట్టుకునే ఒంపుసొంపులతో, రెచ్చగొట్టే చూపులతో... సెక్సీ అందాలతో "6టీన్స్‌" చిత్రం ద్వారా తెలుగువారికి పరిచయమైన నవనీత్‌కౌర్‌ ఎందుకనోగానీ అనుకున్నంత స్థాయిలో ఆఫర్లను రాబట్టలేకపోయింది. దీంతో ఈ ఎత్తుపళ్ల సుందరి తమిళం, మలయాళ పరిశ్రమలో అదష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కడికి వెళ్ళింది.
అయితే అక్కడ కూడా పరిస్థితిలో మార్పులేదు. దీంతో విసుగు చెందిన కౌర్ పెళ్లి చేసుకుంటే ఓ పనై పోతుందన్న నిర్ణయానికి వచ్చింది. ఎలాగూ సినిమాల్లో సెటిలవలేకపోయింది కనుక పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని చూస్తోంది. ఈ అమ్మడు వివాహం మహారాష్ట్రకు చెందిన ఎం.ఎల్‌.ఎ. రవి రాణాతో జరగనుంది.
మరో విశేషం ఏమిటంటే 2011 సంవత్సరం అడుగిడిన సందర్భంగా అమరావతి ఆలయంలో 2011 జంటలు వివాహబంధంతో ఏకంగా కానున్నాయి. ఈ జంటలతోపాటే నవనీత్ కౌర్, రాణాలిద్దరూ పెళ్లి పీటలపై కూచోబోతున్నారు. ఇలా నవనీత్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కనుంది. సినిమాల్లో రికార్డులు సృష్టించకపోయినా... పెళ్లితో రికార్డులకెక్కనుంది. కౌర్‌కు అడ్వాన్స్ విషెస్ చెప్పేద్దాం.

No comments:

Post a Comment