Saturday, November 19, 2011

ఫేస్‌బుక్ జాబ్‌ వదులుకున్నప్పుడు ఫీలయ్యా: నిఖిత నారాయణ

'ఫేస్‌బుక్‌' సంస్థలో నెలకు లక్ష రూపాయల జీతమిచ్చే ఉద్యోగం ఒకవైపు- 'ఇట్స్‌ మై లవ్‌స్టోరి' చిత్రం ద్వారా లక్షలాది ప్రేక్షకులకు పరిచయమయ్యే గొప్ప అవకాశం ఒకవైపు... ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు... నేను రెండో అవకాశాన్ని సొంతం చేసుకోవడానికే మొగ్గు చూపానని అంటోంది 'నిఖిత నారాయణ'.

మధుర శ్రీధర్‌ దర్శకత్వంలో మల్టీడైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. సమర్పణలో, షిరిడిసాయి కంబైన్స్‌ పతాకంపై డా||యం.వి.కె. రెడ్డి నిర్మించిన 'ఇట్స్‌ మై లవ్‌స్టోరి' విడుదలై అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ
చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన 'నిఖిత నారాయణ' తన మనోభావాలను ఇలా తెలియజేసింది.

ప్రశ్న: సినిమా చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది?
జ: హీరోయిన్‌గా నటించేటప్పుడు టెన్షన్‌ పడ్డాను. సినిమా విడుదలయ్యాక ఏం జరుగుతుందో... తొలి చిత్రమే తేడా వస్తే... కెరీర్‌ ఎటువైపు ఉంటుందనే ఆలోచనే ఉంది. ఈ విషయమే దర్శకుడితో చెప్పేవాడిని... అంతా కూల్‌గా ఉండమని అనేవారు. ఆయన
దర్శకత్వం కూడా అంత కూల్‌గా ఉండేది.

ప్రశ్న: ఇప్పుడు రెస్పాన్స్‌ ఎలా ఉంది?
జ: విడుదలై నాలుగురోజుల తర్వాత ఆంధ్ర టూర్‌ నిర్వహిస్తున్నాం. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాల్లో మంచి స్పందన వుంది. మేం కొత్తఅయినా థియేటర్లలో ఆడియన్స్‌ బాగా రిసీవ్‌ చేసుకుంటున్నారు. ఆదివారం వైజాగ్‌ వెళుతున్నాం.
అటునుంచి తిరిగి హైదరాబాద్‌ వచ్చాక.. తెలంగాణ టూర్‌ నిర్వహిస్తాం. ఇలా టూర్స్‌ వెళ్లడం నాకు థ్రిల్‌ కల్గిస్తుంది. ఏ ఉద్యోగం చేసినా ఇటువంటి రెన్సాన్స్‌ రాదు.

ప్రశ్న: నటనకు అంకురార్పణ ఎలా జరిగింది?
జ: ''నేను పదేళ్ళ వయసులో ఉన్నప్పుడు అనుకోకుండా 'అన్నపూర్ణ ఐయోడైజ్డ్‌ సాల్ట్‌' యాడ్‌లో యాక్ట్‌ చేసే అవకాశం లభించింది. ఆ ప్రభావం వలనో ఏమో యాక్టింగ్‌ అంటే ఇంట్రెస్ట్‌ ఏర్పడింది. 2009 లో 'డాబర్‌ మిస్‌ ఫ్రెష్‌ ఫేస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌' గా ఎంపిక కావడం, 2010 లో 'మిస్‌ సౌత్‌ ఇండియా' రన్నరప్‌గా నిలవడం.. ఆ ఇంట్రెస్ట్‌ను మరింత పెంచింది.

ప్రశ్న: అవకాశం ఎలా వచ్చింది?
జ: బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ లో బ్యాచిలర్‌ డిగ్రీ తీసుకుని, 'ఫేస్‌బుక్‌' లాంటి ప్రఖ్యాత సంస్థలో నెలకు లక్ష రూపాయల జీతమొచ్చే ఉద్యోగం వచ్చినా.. నా మనసు నటన వైపే మొగ్గు చూపింది. ముఖ్యంగా 'ఇట్స్‌ మై లవ్‌స్టోరి' చిత్రానికి జరిగిన
స్టార్‌హంట్‌లో వందలాది అమ్మాయిల మధ్య హీరోయిన్‌గా నేను ఎంపిక కావడం నా ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచింది.

ప్రశ్న: ఉద్యోగం వదులుకున్న ఫీలింగ్‌ కలగలేదా?
జ : అయితే 'ఇట్స్‌ మై లవ్‌స్టోరి' చేస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఫేస్‌బుక్‌ జాబ్‌ వదులుకుని తప్పు చేశానా.. అనే చిన్న టెన్షన్‌ నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ 'ఇట్స్‌ మై లవ్‌స్టోరి' విడుదలై విజయవంతం అయ్యాక, అందులో నేను ప్లే చేసిన 'వందన' క్యారెక్టర్‌కు కాంప్లిమెంట్స్‌ లభించడం మొదలయ్యాక.... నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నా ఫ్రెండ్స్‌ మరియు రిలేటివ్స్‌ ఇప్పుడంతా నన్ను నా పేరుతో పిలవడం మానేసి 'వందన' అని పిలుస్తున్నారు.

పరిచయ చిత్రంతోనే పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్‌ ఉన్న హీరోయిన్‌ క్యారెక్టర్‌ లభించడం నిజంగా నా అదృష్టం. అయితే ఈ క్రెడిట్‌ అంతా మా డైరెక్టర్‌ మధుర శ్రీధర్‌కే చెందుతుంది. ఒక హిట్‌ సినిమాతో నా కెరీర్‌ ప్రారంభం కావడం నాకు చాలా గర్వంగా ఉంది. మా డైరెక్టర్‌ మధుర శ్రీధర్‌, మా ప్రొడ్యూసర్‌ యం.వి.కె రెడ్డిలకు జీవితాంతం రుణపడి ఉంటాను.

ప్రశ్న: అన్నిరకాల పాత్రలు హీరోయిన్లు చేస్తున్నారు.మరి మీరు?
జ: ముందు ముందు మరిన్ని వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నాను. 'ఇట్స్‌ మై లవ్‌స్టోరి'లొ ట్రెడిషనల్‌ ఫ్యామ్లీకి చెందిన అమ్మాయిగా చాలావరకు సంప్రదాయబద్దంగా నటించిన నేను.. అవసరమైతే అల్ట్రా మోడర్న్‌ క్యారెక్టర్స్‌ చేయడానికి సైతం వెనకాడను' అంటూ 'ఇట్స్‌ మై లవ్‌స్టోరి' చిత్రం ద్వారా తనకు లభిస్తున్న గుర్తింపు పట్ల పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది నిఖిత నారాయణ!!

No comments:

Post a Comment