Sunday, April 1, 2012

ప్రియమణి సినీ కెరీర్‌ ముగిసినట్టేనా?

priyamani
టాలీవుడ్ బ్యూటీ ప్రియమణి సినీ కెరీర్ ముగిసినట్టేనా?.ఈ సందేహం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ చిత్ర రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతీయ అవార్డును కైవసం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. గతంలో పోషించిన కొన్ని గ్లామరస్ పాత్రల వల్ల తన కెరీర్‌కు తానే చెక్ పెట్టుకున్నట్టు వార్తలు వినొస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో ప్రియమణికి అవకాశాలు లేకుండా పోయాయి. గతంలో ఎన్నో మంచి ప్రాజెక్టులు ఆమెను వెతుక్కుంటూ వచ్చినప్పటికీ.. వాటిని ఆమె సరిగా వినియోగించులేక పోయారని, ఇపుడు అలాంటి ప్రాజెక్టుల కోసం వేచి చూస్తున్నా.. అవకాశాలు రావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

టాలీవుడ్‌లో అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఒకవేళ వచ్చినా చిన్నా చితకా పాత్రలు, ఐటమ్ సాంగ్‌లు వంటి ఛాన్సులు మాత్రమే వస్తున్నాయి. అందుకే ఆమె మెల్లగా కన్నడ చిత్ర పరిశ్రమపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment