Monday, April 29, 2013

పిక్చర్స్: కామకేళిలో కదను తొక్కాలంటే..


కామసూత్రను శృంగారానికి సంబంధించి శాస్త్రీయ గ్రంథంగా పరిగణిస్తారు. సుగంధపరీమళాల గురించి, నూనెల గురించి ఈ గ్రంథంలో వాత్సాయనుడు ప్రముఖంగా చెప్పాడు. కామోద్వేగానికి, శృంగార భావనలకు ఆయిల్స్‌ను వాడడం అనేది ప్రాచీన కాలం నుంచి ఉంది. సువాసలను వెదజల్లే ఆయిల్స్ వల్ల పిత్తాశయాన్ని ఉద్వేగ పరిచి హార్మోన్లు విడుదల కావడానికి ఉపయోగపడుతుంది. అవి పరోక్షంగా మనలో శృంగార భావనలను ఉద్దీపింపజేస్తాయి. వేదల్లో కూడా సంతానప్రాప్తికి వాడాల్సిన మొక్కల గురించి చెప్పినట్లు పండితులు చెబుతారు. ఆయిల్స్‌తో దంపతులు పరస్పరం శరీరాన్ని మర్ధన చేసుకోవడం ద్వారా కామోద్రేకం పెరుగుతుంది. ఆయిల్స్ వెదజల్లే పరీమళం దంపతులను రతిక్రీడ వైపు మళ్లిస్తాయి. ఆహ్లాదకరమైన పరీమళాలు మనిషికి ఊరటను ఇచ్చి, ఆనందం వైపు పరుగులు తీయిస్తుంది. గులాబీ పుప్వులను చూస్తే శృంగార భావనలు ఇట్లే కలుగుతాయి. మల్లెపూవులను శృంగారానికి అవసరమైన పుష్పాలుగా పరిగణిస్తాం. మల్లెపూవులు జడలు తురుముకుని కాంత తన పురుషుడి కోసం నిరీక్షించడం అనేది మనం పలు సినిమాల్లో చూస్తుంటాం. మల్లెపూవులు వెదజల్లే సువాసన దంపతులను లైంగిక క్రీడ వైపు మనసును లాగుతాయి. అందుకే సుగంధ ద్రవ్యాలకు, సువాసనలు వెదజల్లె చముర్లకు రతిక్రీడలో అధిక ప్రాధాన్యం ఉంది.


No comments:

Post a Comment