Friday, September 6, 2013

'' ఎప్పుడొచ్చామన్నది కాదన్నయా

'' ఎప్పుడొచ్చామన్నది కాదన్నయా... బుల్లెట్ దిగిందా లేదా అనేది పాయింటు''... ''ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను'' పోకిరి సినిమా లో మహేష్ బాబు తో పవర్ పుల్ డైలాగ్స్ చెప్పించి టాలీవుడ్ అభిమానులను తన
వైపుకు తిప్పుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇదే తరహాలో నవతరం హీరోలు కూడా తమదైనా శైలిలో డైలాగ్ లు వేస్తూ సినీ పరిశ్రమలో ఓ ఊపు ఊపుతున్నారు. యువతను ఆకర్షించేందుకు తమ లో ఉన్న కొత్త దనంతో పాటు ఇలాంటి డైలాగ్స్ ను సినిమాలో పెట్టడంతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యువ దర్శకులు హిట్టవుతున్నారు.సీనియర్, జూనియర్ అనే భేదం లేకుండా క్రియేటివిటీతో తెలుగు ఇండస్ట్రీస్ లో చలామణి అవుతున్నారు. ఈ మాటను నిజం చేస్తూ ఈ మధ్య కొందరు యువ కిశోరాలు సినీ పరిశ్రమను ఏలేస్తున్నారు . సీనియర్ లు అవాక్కయేలా సక్సెస్ లు సాధిస్తూ ఇండస్ట్రీ ని కొత్త ట్రాక్ లో నడిపిస్తోన్న యంగ్ టాలెంట్ పై ట్రెండ్ గురు స్పెషల్ పోకస్....
'అక్షర' మథనం...
శ్రీ మణి : అసలు పేరు గిరీష్ . అమ్మ పేరు ను తన పెన్ నేమ్ గా మార్చుకుని పాటలు రాయడం మొదలెట్టాడు . శ్రీ మణి రాసిన ఈ ఆరడుగుల బుల్లెట్టు, 100% లవ్ సినిమాలో 'అహో బాలు', 'a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్' అనే పాట కూడా రాశాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అతనికి తన హిట్ ఆల్బమ్స్ లో చక్కని ప్లేస్ మెంట్ ఇస్తున్నాడు . త్రివిక్రమ్ డెరెక్షన్ లో వచ్చిన జులాయి సినిమాలో మీ ఇంటికి ముందో గేటు ...ఒసేయ్ ఒసేయ్ వదిలేసి వెళ్ళిపోకే ....చక్కని బైక్ ఉంది ..... శ్రీమణి రాసిన ముచ్చటైన మూడు పాటలు మంచి హిట్ సాధించాయి .
అనంత్ శ్రీరామ్ : చిన్న వయసులోనే చక్కని పాపులారిటి సాధించాడు అనంత్ శ్రీ రామ్ . కాదంటే అవుననిలే. సినిమా లో పాటలు రాసి గీత పరిశ్రమకు పరిచయయి, ఒక ఊరిలో ...అందరి వాడు .బొమ్మరిల్లు లాంటి ఎన్నో సినిమాలకు పాటలు రాసి రైటర్ గా మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు . ఏ ఆర్ రహమాన్ సంగీత దర్శకత్వం లో పాటలు రాయడమంటే అదృష్టంగా భావిస్తారు . ''ఏ మాయ చేసావే''లో ఏకంగా అన్ని పాటలు రాసేసి యమ లక్కీ అనిపించేసుకున్నాడు శ్రీరాం. క్లాసు, మాస్ అంటూ తేడా లేకుండా తనకంటూ ఓ సెపరేట్ ట్రెండ్ సెట్ చేసుకున్నాడు శ్రీ రామ్.
డైనమిక్ డైరెక్టర్స్...
హరీష్ శంకర్ : సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ తో బాగా ప్రచుర్యంలోకి వచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. షాక్ సినిమాతో దర్శకుడైన హరీష్ , మిరపకాయ్ తో సక్సెస్ సాధించాడు . ఇక గబ్బర్ సింగ్ తో ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నాడు. ఎన్టీఆర్ తో రామయ్యా వస్తావయ్యా తో వస్తున్నాడు.
సంపత్ నంది : వరుణ్ సందేశ్ లాంటి చిన్న హీరోతో ''ఏమైంది ఈ వేళ'' తీసి సక్సెస్ సాధించిన దర్శకుడు సంపత్ నంది. తన టాలెంట్ తో రెండో సినిమా రామ్ చరణ్ తో 'రచ్చ' చేయించాడు. ఈ సినిమా విజయంతో స్టార్ డైరెక్టర్ ముద్ర దక్కించుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ 2 సినిమా తీస్తున్నాడు.
వీరభద్రం: ఆహ నా పెళ్లంట, పూల రంగడు సినిమాలతో తానేంటో చూపించుకున్నాడు కుర్ర దర్శకుడు వీరభద్రం. సునీల్, నరేష్ లాంటి కామెడీ హీరోలతో హిట్టు కొట్టి, నాగార్జునాతో భాయ్ సినమా ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే వీరభద్రం స్టార్ డైరెక్టర్ అవ్వడం ఖాయం.
సంతోష్ శ్రీనివాస్ : కందిరీగ సినిమాతో టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు పొందిన యువ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. రామ్ లోని ఎనర్జీని చూపించి ఎన్టీఆర్ తో రభస ఛాన్స్ కొట్టేసాడు.
సుధీర్ వర్మ : స్వామిరారా సినిమాతో బ్యాక్ గ్రౌండ్ లేకున్నా సత్తా ఉంటే చాలని ఇండస్ట్రీ కి చాటి చెప్పిన యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ. ఇప్పుడు సుధీర్ కు రెండు పెద్ద ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం.
సంగీత సంచలనాలు...
అనూప్ రూబెన్స్ : జై సినిమా నుండి ఇండస్ట్రీలో ఉన్నా ప్రేమ కావాలి సినిమాతో హిట్ కొట్టి బిజీ గా మారిపోయాడు అనూప్. వరుస ప్లాపులతో ఉన్న నితిన్ కు రెండు బిగ్ హిట్స్ ఇష్క్, గుండెజారి గళ్లంతయ్యిందే సినిమాల సక్సెస్ లో అనూప్ పాత్ర తక్కువేం కాదు. ప్రస్తుతం అక్కినేని కుటుంబం కలిసి నటిస్తోన్న 'మనం' ఎన్టీఆర్ రభస లాంటి బడా ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు.
తమన్ : తక్కువ సమయంలోనే ఎక్కువ హిట్లు సాధించిన మరో యువ సంగీత తరంగం తమన్. కిక్ సినిమాతో హిట్ సాధించి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.
దేవీ శ్రీ : తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న ఏకైక యువ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్. గబ్బర్ సింగ్ లాంటి ఎన్నో మ్యూజిక్ సునామీలు సృష్టించిన దేవీ. ట్యూన్స్ ని డాన్స్ చేయించగలడు. ఇతడు పాటలు రాస్తూ, పాడుతూ, సంగీత ప్రపంచంలో తన దైన ముద్ర వేసుకున్నాడు.
టాలెంట్ ఉంటే ప్రపంచాన్ని దున్నేయొచ్చు అని నిరూపించి, యంగ్ టాలెంట్ కు ప్రతిరూపంగా నిలుస్తున్న ఈ యంగ్ తరంగాలు మరెంతో మందికి ప్రేరణగా నిలుస్తారని ఆశిద్దాం.

No comments:

Post a Comment