Saturday, September 7, 2013

నాలాగే నరేంద్ర మోడీ అంటున్న మల్లికా శరావత్... హవ్వ ఎంతమాట...?

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గురించి తెలియనివారెవరు..? ఐతే బాలీవుడ్ సెక్సిణి, శృంగార తార మల్లికా శరావత్ మా
త్రం నరేంద్ర మోడీ తనలాగే అంటూ ఓ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఆ విషయం ఏంటయా అంటే, 62 ఏళ్ల నరేంద్ర మోడీ అసలైన బ్రహ్మచారిగా ఆమె పేర్కొంది.

మరో 4 ఏళ్లలో 40ల్లో అడుగుపెడుతున్న సెక్సిణికి పెళ్లిపై గాలి మళ్లిందట. అందుకే త్వరలో తన జీవిత భాగస్వామిని వెతుక్కునే పనిలో పడింది. ఓపెన్ ప్రకటనిస్తే చేసుకునేవారు రారనుకుందో ఏమో కానీ 'ద బ్యాచులరేట్ ఇండియా-మేరే ఖయాలోన్‌కి మల్లిక' అనే టీవీ కార్యక్రమం ద్వారా తనకు కాబోయే వాడిని వెతుక్కోవాలనుకుంటోంది.

ఈ కార్యక్రమం అక్టోబరు 7వ తేదీ నుంచి లైఫ్ ఓకే చానల్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఆమెను దేశంలో అన్ని అర్హతలూ ఉన్న బ్రహ్మచారి ఎవరూ అని ప్రశ్నిస్తే టక్కున నరేంద్ర మోడీ అంటూ చెప్పేసింది. అంతేకాదు... నరేంద్ర మోడీ చాలా స్మార్ట్, పనితీరు గల వ్యక్తి. తరచుగా తనలాగే అపార్థం చేసుకుంటూ ఉంటారంటూ మెలికలు తిరుగుతూ చెప్పింది. అన్నట్లు మోడీకి నిజంగానే పెళ్లి కాకుంటే సెక్సిణి లైన్ వేసేదేమో ఆమె కామెంట్లు విన్న జనం గుసగుసలాడుకుంటున్నారు.

No comments:

Post a Comment