శిరోజాల అందం, ఆరోగ్యం, వాటి ఎదుగుదల, వాటికి ఏర్పడే
అనారోగ్యాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రైకాలజీ అంటారు.
ట్రైకాలజీలో డిప్లమా చేసినవారూ లేదా డిగ్రీ పొందినవారు బ్యూటీ
ఎక్స్‌పర్ట్స్‌గా,
హెయిర్‌స్టయిలిస్ట్‌గా వృత్తిని చేపట్టి, ఆర్జించవచ్చు. శిరోజాలను గురించి అధ్యయనం చేసినవారు శిరోజా లలో ఏర్పడే అనారోగ్యాలకు కారణమే మిటి, వెంట్రుకలు అధికంగా ఎందుకు రాలిపోతున్నాయి, దానికి నివారణ ఏమిటన్నది తెలుసుకోగలుగు తారు.
ఒత్తుగా, నల్లగా నిగనిగలాడే వెంట్రు కల వల్ల ముఖ సౌందర్యం పెంపొందు తుంది. జట్టు పొడుగ్గా ఉంటే, ఏ రకమైన హెయిర్‌స్టైల్ అయినా చేసుకో వచ్చు. జుట్టు సంరక్షణ పట్ల శ్రద్ధ తీసుకుంటే శిరోజాల ఆరోగ్యం బాగుం టుంది. జుట్టుకు హాని కలిగించేది తీక్షణ మైన ఎండ, పొగ, కలుషిత వాతావరణం, అపరిశుభ్రత. ఒకవేళ అలాంటి ప్రదేశాలకు తప్పనిసరిగా వెళ్లవలసి వచ్చినా, కొంత సమయం ఉండవలసి వచ్చినా, తలకు ఆచ్ఛాదన ఉండాలి. తలకు తెల్లని టోపీ పెట్టుకోవడం మంచిది. వెంట్రుకలు పరిశుభ్రంగా ఉండడానికి వారానికి ఒకసారి తల స్నానం చేయాలి. స్వేదం ఎక్కువగా స్రవించే వేసవిలో వారానికి రెండు మూడు సార్లు తలస్నానం చేయాలి. జుట్టు పరిశుభ్రతను పాటిస్తే, వెంట్రుకలు రాలి పోకుండా ఉంటాయి.
ఉంగరాలు తిరిగిన జుట్టు కంటే సాఫీగా, పొడుగ్గా ఉండే వెంట్రుకలు దృఢంగా ఉంటాయి. తల వెంట్రుకలలో ఉండే కార్టెక్స్ అనే భాగంలో జుట్టుకు రంగును కలుగజేసే పిగ్మెంట్ ఉంటుంది. ఇది జుట్టు రంగుకు కావలసిన పదార్థాన్ని సమ కూరుస్తుంది. వెంట్రుకల కుదుళ్లు చర్మం లోపలి భాగంలో ఉంటాయి. ఇవి హెయిర్ ఫాలికల్స్ నుండి వెలువడతాయి. తల మీద ఉండే చర్మం లోపల గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల నుంచి స్రవించే నూనె వెంట్రుకలకు చేరుకుంటుంది.
జుట్టుకు వారానికి మూడు, నాలుగుసార్లు పరిశుద్ధమైన కొబ్బరినూనె రాయాలి. తలంటి స్నానానికి ముందు, కొబ్బరి నూనెను వెచ్చ చేసి తలకు బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి. తల స్నానానికి కుంకుడు కాయలు, సీకా కాయ ఉపయోగిస్తే ఆరోగ్యంగా ఉంటాయి. శిరోజ సంరక్షణకు, మెంతులు, ఉసిరి, గుడ్డు, వాడేసిన టీ పొడి డికాషన్, పుల్లటి పెరుగు, ముల్తానా మట్టి, గోరింటాకును ఉపయోగించవచ్చు.
ఒత్తయిన జుట్టు, ముఖానికి నప్పే హెయిర్‌స్టైల్ స్త్రీల సౌందర్యాన్ని పెంచుతా యనడంలో సందేహం లేదు. వెంట్రుకను పరీక్షించి, దానితో ఆ వ్యక్తి ముఖ్య వివరాలను సేకరించవచ్చు. ఫోరోన్సిక్ నిపుణులు, ఒక వెంట్రుకను పరిశీలించి నేరస్థుణ్ణి గుర్తించగలుగుతారు. వెంట్రుకలు అధికంగా రాలిపోతుంటే, థైరాయిడ్ గ్రంథి పనితీరు సవ్యంగా ఉందో లేదో పరీక్ష చేయించుకోవాలి. పని విధానంలో అస్తవ్యస్థత ఏర్పడితే వెంట్రుకలు రాలిపోతూ, జుట్టు పలుచబడుతుంది. హైపర్ థైరాయిడిజం ఏర్పడినప్పుడు, వెంట్రుకలు తెల్లబడతాయి.
కొంతమందికి తల మీద ఒక ప్రదేశంలో వెంట్రుకలన్నవే లేకుండా గుండ్రంగా ఖాళీ ఏర్పడుతుంది. దానికి కారణం తల మీద చర్మానికి అంటువ్యాధి సోకడం లేదా అనారోగ్యాలు ఏర్పడడం, నరాల బలహీనత, పోషకాహార లోపం వల్ల కూడా వెంట్రుకలు రాలి పోతాయి. వెంట్రుకలు చిట్లిపోవడం జరుగుతుంది. వాతావరణం, నీటి ప్రభావం, వెంట్రుకల నిర్మాణం, వెంట్రుకల పొడవులో హెచ్చు తగ్గులు, కేశాల రంగు, అక్కడ నివసించే వారి జుట్టుపై ప్రసరిస్తుంది.
చక్కని తలకట్టు, ఒత్తయిన జుట్టు, వారి ముఖానికి, రూపానికి నప్పే హెయిర్‌స్టయిల్ అందాన్ని పెంచి, ఆకర్షణీ యంగా కనిపించేలా చేస్తుంది. అందుకే, శిరోజాల పరిశుభ్రత, తద్వారా ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.

No comments:
Post a Comment