రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా
జరుపుకుంటున్నారు. బుధవారం మూడో రోజు కాబట్టి పలువురు వినాయక విగ్రహాలను
నగరంలోని పలు చెరువులలో నిమజ్జనం చేశారు. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని
వివిధ చెరువులలో వినాయక నిమజ్జనం జరిగింది.
మూడు రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథులను ఆయా మండపాల నిర్వాహకులు
భక్తిశ్రద్ధలతో మేళతాళాల మధ్య బుధవారం నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనం
కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాదు పరిధిలో 90, సైబరాబాద్ పరిధిలో
70 విగ్రహాలను నిమజ్జనం చేశారని పోలీసులు చెప్పారు.
కూకట్‌పల్లి నిజాంపేట రోడ్డులోని రిషీ వుమన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో వినాయక
నిమజ్జనం ఘనంగా జరిగింది. విద్యార్థినులు నిమజ్జన కార్యక్రమంలో ఆనందంగా
పాల్గొన్నారు. తమ ఆట - పాటలతో అలరించారు.
యువతి డ్యాన్స్
నిజాంపేటలోని రిషీ వుమన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో వినాయక చవితి నిమజ్జనం
సందర్భంగా గణనాథుడిని ఊరేగింపుగా తీసుకు వెళ్తున్న సందర్భంగా నాట్యం
చేస్తున్న విద్యార్థిని.
No comments:
Post a Comment