Friday, September 13, 2013

కమల్‌కు మరో పురస్కారం

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌కి అవార్డులు కొత్త కాదు. గతంలో ఎన్నో అవార్డులు ఆయనని వరించాయి. ఈ కోవలో ఇప్పుడు మరో అవార్డు ఆయన
ప్రతిభకు పట్టం కడుతోంది. అక్టోబర్‌ 17 నుంచి ముంబరు నగరంలో నిర్వహించే 'ముంబరు ఫిలిం ఫెస్టివల్స్‌'లో కమల్‌ను జీవన సాఫల్య పురస్కారం (లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు)తో సత్కరించునన్నారు. ఈ విషయాన్ని వేడుకల చైర్మన్‌ శ్యాం బెనగల్‌ తెలియజేశారు. గత యాభై సంవత్సరాలుగా చిత్రసీమలో ఉంటూ, వివిధ శాఖలకు ఆయన చేసిన విశిష్ట సేవలకుగాను కమల్‌ను ఈ అవార్డుతో సన్మానించనున్నట్టు బెనగల్‌ చెప్పారు. ముంబారు అకాడమీ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో 65 దేశాలకు చెందిన 200 చిత్రాలను ప్రదర్శిస్తారు.

No comments:

Post a Comment