'పవన్ కళ్యాణ్' టాలీవుడ్ లో పవర్ ఫుల్ హీరో, 'త్రివిక్రమ్ శ్రీనివాస్'..
'పంచ్ డైరెక్టర్' కేరాఫ్ అని అందరికి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో
రూపొందిన 'అత్తారింటికి దారేదీ' త్వరలోనే విడుదలకు సిద్ధమైంది. ఇక
దర్శకుడిగానే కాదు పవన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే సన్నిహితుల్లో
త్రివిక్రమ్ ఒకరు. ఇప్పుడు వీరి ఫ్రెండ్షిప్ ఇంకా ముందుకెళ్లింది. ఇద్దరూ
కలిసి కొన్ని సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నారట. దీనికి గాను ఓ
బ్యానర్ ఏర్పాటు చేసి, దానిపై సినిమాలు తీయాలని డిసైడ్ అయినట్లు టాలీవుడ్
సమాచారం. అయితే ఈ బ్యానర్ ద్వారా కొత్త కళాకారులకు, నటీనటులకు అవకాశాలిచ్చి
తెలుగు తెరకు పరిచయం చేయాలని భావిస్తున్నారట. సో మరి పవన్, త్రివిక్రమ్
చేసే ఈ ప్రయత్నం కమర్షియల్ గా కాకుండా కళామతల్లికి సేవ చేసేలా ఎదగాలని
కోరుకుందాం..
No comments:
Post a Comment