Saturday, September 14, 2013

సచిన్ కోసం మెలిక పెట్టారు: బిసిసిఐపై బాయ్‌కాట్


భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుల మధ్య వివాదాలన్నీ సచిన్ టెండూల్కర్ 200వ టెస్ట్‌కోసమేనని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జెఫ్రీ బాయ్‌కాట్ అన్నాడు. తన 200
వ టెస్ట్‌ను భారత్‌లో నిర్వహించాలని సచిన్ కోరలేదని, అలాంటప్పుడు దక్షిణాఫ్రికా టూర్‌నే రద్దుచేసుకునే పరిస్థితి తీసుకురావడం బాధాకరమని ఆయన అన్నాడు. భారత్ ఇలా నిర్ణయాలు తీసుకోవడం తగదని, వేరే బోర్డులు తమ పట్ల ఇలాగే వ్యవహరిస్తే భారత్ ఊరుకుంటుందా అని ఆయన అన్నాడు. మూడు టెస్ట్‌లు ఆడతామని తొలుత ఒప్పుకు న్న బిసిసిఐ తర్వాత మెలికలు పెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నాడు. ఈ వివాదమంతా సచిన్‌లాంటి దిగ్గజ ఆటగాడి చుట్టూ తిరగడం దురదృష్టకరమని బాయ్‌కాట్ అన్నాడు. కేవలం ఒక వ్యక్తికోసం రెండుదేశాల మధ్య సంబంధాలు చెడిపోవడం కూడా సరికాదన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకుని స్వదేశంలో వెస్టిండీస్‌తో భారత్ సిరీస్‌ను ఏర్పాటు చేసిందని, సచిన్ 200వ మ్యాచ్ స్వదేశంలో ఆడాలని ఆలా చేసిందని, ఇది సరి కాదని ఆయన అన్నాడు. బిసిసిఐ నుంచి పూర్తి స్థాయిలో అంగీకారం తీసుకోకుండా దక్షిణాఫ్రికా బోర్డు సిరీస్ షెడ్యూల్‌ను విడుదల చేయడం కూడా సరి కాదని అన్నాడు. దక్షిణాఫ్రికా విషయంలో భారత్ తన బాధ్యతను నిర్వహించాల్సి ఉందని అన్నాడు.


No comments:

Post a Comment