Saturday, September 14, 2013

హృతిక్.. మాధురీకి వీరాభిమానట!

బాలీవుడ్ స్టైలీష్ స్టార్ హృతిక్ రోషన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ అందాల తార మాధురీ దీక్షిత్ కు తాను వీరాభిమానినని చెప్పారు. ఆయన కొత్తగా నటిస్తున్
న 'క్రిష్ 3' సినిమా ప్రమోషన్లో భాగంగా ముంబయ్ లో జరుగుతున్న 'జలక్ దిఖ్లా ఝా 6' గ్రాండ్ఫైనల్ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నాడు. మాధురీతో కలిసి స్టేజిపై సరదాగా ఆడి పాడారు. ఈ సందర్భంగా హృతిక్ మాట్లాడుతూ...' నాకు చిన్నానాటి నుంచి మాధురీ దీక్షిత్ అంటే ఇష్టం. ఆమె నటన నాకు నచ్చింది. మాధురీకి నేను అభిమానిని. ఆమె నవ్వితే చాలా అందంగా ఉంటుంది. అత్యంత ప్రభావంతులైన మహిళల్లలో ఆమె ఒకరు'. అని అన్నాడు. హృతిక్, మాధురీ నటించిన సినిమాల్లోని కొన్ని సూపర్ హిట్ పాటలకు వీరిద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. 'క్రిష్3' సినిమాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది.

No comments:

Post a Comment