Sunday, September 15, 2013

సమంత..'ఆ హీరో' కు నో చెప్పిందట.!


'సమంత'..ఇప్పుడు టాలీవుడ్ ను హీరోలను తన చుట్టూ తిప్పుకుంటున్న అందాల భామ. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్న ఈమె దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఒక్క రామ్ చరణ్ తో నటించనని చెబుతోందట. నిన్నటికి నిన్న ఎన్టీఆర్ కోసం ఏమైనా చేస్తానన్న సమంత ఇప్పుడు చరణ్ సినిమాయే చేయనంటోందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే చరణ్ కు మాత్రం సమంతతో నటించాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడట. అందుకే గతంలో 'ఎవడు' సినిమాలోనే మెయిన్ హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాడు. అయితే అప్పుడు చేతినిండా సినిమాలుండటంతో సమంత కుదరదని చెప్పిందట. కానీ ఇప్పుడు మాత్రం చరణ్ తోనా .. అయితే నో అంటోందని టాక్..
ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్ లో వెంకటేష్, కృష్ణ తో కలిసి చెర్రీ ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడని టాలీవుడ్ సమాచారం. ఆ సినిమాలో చరణ్ సరసన సమంతను అడిగితే సారీ చెప్పిందట. దీంతో చరణ్ కు సమంత కు ఎక్కడైనా చెడిందా లేక, ఆల్రెడీ బాబాయ్ తో నటించింది కాబట్టి మళ్లీ అబ్బాయ్ తో ఎందుకు అనుకుందా..?అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మెగా అభిమానులను మిగిలింది. దీంతో అబ్బాయ్ తో నటించొద్దని బాబాయ్ చెప్పాడా..? అనేకోణంలో ఆరా తీస్తున్నారు చరణ్ ఫ్యాన్స్. మరి అసలు విషయం తేలే వరకూ మనమూ వేచి చూడాలి.

No comments:

Post a Comment