కారంగా, రుచికరంగా ఉంటుంది.ఈ స్పెషల్ రైస్ ఐటమ్ ను తింటుంటే ఉల్లాసకరంగా ఉంటుంది . సాధారణంగా చైనీస్ వంటలు తయారుచేయడం చాలా తేలిక మరియు చాలా సులభం. మరియు చైనీస్ వంటలంటే ప్రతి ఒక్కరీకి అమితమైన ఇష్టం. ఈ స్పైసీ చిల్లీ కోరియాండ్ రైస్ ఎప్పుడైనా తయారుచేసుకొనే ఒక ఉత్తమ రిసిపి. చిల్లీ కోరియాండర్ రైస్ రిసిపి ని ఒక అద్భుత కాంబినేషన్ రెడ్ చిల్లీ మరియు గ్రీన్ చిల్లీ కాంబినేషన్ లో తయారుచేసుకుంటారు. మీరు కూడా స్పైసీ ఫుడ్ ప్రియులైతే, మీ డిన్నర్ కోసం ఒక ప్రత్యేకమైన వంటకం ఇది. దీన్ని ప్రయత్నించండి. మరియు ఇందులో సోయా సాస్ చేర్చడం వల్ల ఒక పుల్లని టేస్ట్ అందిస్తుంది. స్పైసీ మరియు ట్యాంగీ ఫ్లేవర్ తో ఒక అద్భుతమైన రుచిని అందిస్తూ..టేస్ట్ బడ్స్ ను మరింత ఊరిస్తుంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన పదర్థాలు: బియ్యపు: 2cups నీళ్ళు: 4 cups వెల్లుల్లి: 6-7 రెబ్బలు(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి) ఎండు మిర్చి: 1 (మద్యకు తుంచి పెట్టుకోవాలి) పచ్చిమిరపకాయలు: 4 (మద్యకు కట్ చేసి పెట్టుకోవాలి) సోయా సాస్: 1tbsp కొత్తిమీర: 4tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి) ఉప్పు: రుచికి సరిపడా నూనె: 1tbsp
తయారుచేయు విధానం: 1. ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి డీప్ బాటమ్ పాన్ లో వేసి, సరిపడా నీళ్ళు పోసి మీడియం మంట మీద అన్నం వండిపెట్టుకోవాలి. 2. అన్నం తయారుచేసుకొన్న తర్వాత అన్నంను ఒక ప్లేట్ లోనిక మార్చుకొని చల్లార్చుకోవాలి. 3. అన్నం చల్లారేలోపు, పాన్ ను వేడి చేసి అందులో కట్ చేసి పెట్టుకొన్ని వెల్లుల్లి ముక్కలు వేసి ఒక నిముషం మీడియం మంట మీద వేగించుకోవాలి. 4. తర్వాత అందులో రెడ్ చిల్లీ మరియు గ్రీన్ చిల్లీ ముక్కులు వేసి మరో నిముషం వేగించుకోవాలి. 5. ఇప్పుడు అందులో సోయాసాస్, చల్లారబెట్టుకొన్ని అన్నం, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి, 5నిముషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 6. ఒకసారి వేగించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి, వేడి వేడి గా సర్వ్ చేయాలి. అంతే స్పైసీ చిల్లీ -కోరియాండర్ రైస్ రెడీ. ఈ టేస్టీ రైస్ ను మీకు నచ్చిన సైడ్ డిష్ తో తింటూ ఎంజాయ్ చేయవచ్చు.
.jpg)
No comments:
Post a Comment