మనకు ఎంతమంది రక్త సంబంధీకులున్నా, స్నేహితుల స్థానం చాలా గొప్పది. మంచి స్నేహితులను పొందడమే కాదు, ఏర్పడిన స్నేహాన్ని ఎప్పటికీ కాపాడుకోవాలి. ఎప్పటి నుండో ఉన్న స్నేహమే కదా అని
చులకనగా తీసిపారేయకూడదు. స్నేహితుల పుట్టినరోజు మరచి పోకుండా ఆ రోజు ఒక గ్రీటింగ్ కార్డ్ ఇవ్వండి. దానిపై వారిమీద మీకున్న ప్రేమను తెలుపుతూ సందేశం రాయడం మరువకూడదు. కేవలం పుట్టినరోజులకే కాదు, ఎప్పుడైనా ఫోన్ నుండి ''నాకు ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నందుకు చాలా గొప్పగా భావిస్తున్నాను'' లాంటి సందేశాలు పంపండి. మీ స్నేహాన్ని బలోపేతం చేస్తాయి. మీ ఫ్రెండ్ తన జీవితానికి సంబంధించిన కష్టనష్టాలను చెపుతున్నపుడు తీసిపారేయ కుండా శ్రద్ధగా వినండి. వాళ్ళు చెప్తుంటే మీ అంత మీరు ఏ ఫోన్‌తోనో ఆడుకుంటూ ఉండకూడదు. ఎప్పుడైనా, వాళ్ళకు ఇష్టమైన చిన్న చిన్న వస్తువులు బహుమానంగా ఇచ్చి చూడండి. అది ఇద్దరికీ సంతోషాన్ని ఇస్తుంది.
ఇద్దరి మధ్య నమ్మకం అనే పునాది వేయాలి
అంత నమ్మకం లేకుండా ఎలా ఉంటాం. మా మధ్య నమ్మకం ఉందని అనుకోవచ్చు. ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లే బంగారంలాంటి స్నేహాన్ని పాడు చేస్తాయి. ఎలా అంటే, మీకు మీ ఫ్రెండ్‌లో నచ్చని విషయాన్ని ముఖంపైనే సున్నితంగా చెప్పండికానీ, ఈ విషయాన్ని బయటివారితో అనకూడదు. గాసిప్స్ తొందరగా అల్లుకుపోతాయి. అది మీ ఫ్రెండ్‌కి తెలిస్తే మీమీద నమ్మకం పోతుంది. ఏదైనా సహాయం చేస్తానని కానీ, ఎక్కడైనా కలుస్తానని కానీ ఫ్రెండ్‌కి మాట ఇస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనైనా నిలబెట్టుకోవాలి. వేరే ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్తుంటే, వేరే వారితో సమయం గడపడానికి వెళ్తు ్తన్నట్టు మీ ఫ్రెండ్‌కి చెప్పాలి. దాచకూడదు. మీ ఫ్రెండ్ మీతో మాత్రమే పంచుకున్న వ్యక్తిగత విషయాలను, రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లో బట్టబయలు చేయొద్దు.
స్నేహం అవసరానికి వాడుకునేది కాదు
మనం కావాలని చేయకపోయినా కేవలం అవసరమైనపుడు మాత్రమే కలుసుకోవడం, ఎప్పుడో కానీ గుర్తుచేసుకోకపోవడం సరికాదు. ఇద్దరూ కలిసి ఏదైనా క్లాస్‌లో చేరొచ్చు. దానివలన కొంత సమయం కలిసి ఉండటానికి వీలవుతుంది. ఒకరి సాంగత్యం ఒకరు ఆనందించాలి. వారాంతంలో కలిసి ఎప్పుడైనా సినిమాలు, షికార్లు చేయొచ్చు. కలిసి చదువుకోవచ్చు. ఇంట్లో వంట చేసి, ఒక సాయంత్రం మీ ఫ్రెండ్‌కి ప్రత్యేక విందు ఇవ్వొచ్చు. మీ ఫ్రెండ్‌కి కష్టం వచ్చినా, ఆనందం కలిగినా వెంటనే మీరే గుర్తు వచ్చేట్టు ఉండాలి. మీకు సాయం చేసిన స్నేహితులకు కృతజ్ఞతలు చెప్పడానికి ఏమాత్రం మొహమాటం తగదు. మీ స్నేహితులు మీకెలా సహాయపడుతున్నారో మీరు కూడా అలాగే సాయపడాలి. ఈ ఫ్రెండ్‌షిప్ సూత్రాలు పాటించి చూడండి. మీ స్నేహం పదికాలాలు నిలిచి ఉంటుంది.

No comments:
Post a Comment