Monday, January 27, 2014

దర్శకుడు మస్తాన్ రావు కన్నుమూత..

సినీ దర్శకుడు బీరం మస్తాన్ రావు(69) ఈరోజు మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా గుండె, కాలేయం సంబంధిత
వ్యాధితో బాధపడుతూ.. చెన్నైలోని భారతీరాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. బుర్రిపాలెం బుల్లోడు, విప్లవ శంఖం, గయ్యాళి గంగమ్మ లాంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఈరోజు సాయంత్రం మస్తాన్ రావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

No comments:

Post a Comment