చర్మానికి రక్షణ, టైట్‌నెస్, కాంతి, నిగారింపు ఇవ్వటంలో ఫేస్‌ప్యాక్
ఎంతో ప్రధానపాత్ర వహిస్తాయి. అనేక పండ్ల నుంచి ధాన్యాల నుంచి కాయగూరల
నుంచి వీటిని చేసుకోవచ్చు. పైగా అలాంటి ఫేస్‌ప్యాక్స్ ఎంతో మంచివి,
సురక్షితమైనవి కూడా. మంచి వన్నెని, చక్కటి కళను తెచ్చిపెడతాయి. చర్మాన్ని
సౌందర్యవంతం చేస్తాయి. చర్మాన్ని శుభ్రం చేస్తాయి. చర్మ వ్యవస్థని బలోపేతం
చేస్తాయి. పోషకాలు సమతుల్యంగా అందిస్తాయి.
సాధారణంగా చర్మ సంరక్షణలో సహజసిద్దమైన ఫేస్ ప్యాక్ లు ఎంతో ముఖ్యమైన
పాత్ర పోషిస్తాయి. ప్రకృతిలోని సహజమైన తత్వాలతో తయారైన ఈ ఫేస్ ప్యాక్ లు
ముఖ సౌందర్యాన్ని సంరక్షిస్తూ చర్మాన్ని ఆరోగ్యవంతంగా మెరిసేలా చేస్తాయి.
వీటిల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇన్ని సుగుణాలున్న ఫేస్‌ప్యాక్‌లు ఎలా
తయారుచేసుకోవాలో తెలుసుకుందామా!

No comments:
Post a Comment