భార్యాభర్తల మధ్య సంబంధం అత్యంత ముఖ్యమైంది. అంతేకాకుండా చాలా
సున్నితమైంది కూడా. అత్యంత సున్నిత స్వభావం ఆ సంబంధానికి ఉంటుంది. దాంపత్య
జీవితాన్ని సుఖమయం, ఆనందదాయకం చేయడంలో భార్య పాత్ర అత్యంత ప్రధానమైందనే
విషయం కాదనలేని సత్యం.
దైనందిన జీవితంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో దాదాపు అన్ని సమాజాల్లోనూ
పురుషుడే ఆధిపత్యం వహిస్తాడు. నిర్ణయాలు అతని చేతుల్లోనే ఉంటాయి. తన
నిర్ణయాల విషయంలో అతను చాలా పట్టుతో కూడా ఉంటాడు. అందులో తేడా వస్తే అతని
ఈగో దెబ్బ తింటుంది.
అయితే, దంపతుల మధ్య సంబంధాలు పటిష్టం కావడానికి గానీ బలహీనం కావడానికి
పురుషుడి పాత్రతో పాటు మహిళ పాత్ర కూడా ఉంటుంది. కానీ, తన పురషుడి విషయంలో
మహిళ తీసుకునే జాగ్రత్తలు నిర్ణయాల విషయంలోనే కాకుండా దాంపత్య బంధంపై కూడా
ప్రభావం చూపుతాయి.

No comments:
Post a Comment