నిమ్మకాయను విస్తృతంగా అనేక సౌందర్య చికిత్సలలో వాడతారు. నిమ్మకాయలో
విటమిన్ సి ఉన్నది, ఈ విటమిన్ లోతుగా చర్మం రంధ్రాలలోకి వెళ్ళి శుభ్రపరచి
చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. నిమ్మకాయలో అనామ్లజనకాలు ఉండటంవలన చర్మంలో
రక్త ప్రసరణకు సహాయపడుతుంది. నిమ్మకాయను విస్తృతంగా ఇంట్లో ముఖానికి
వేసుకునే మాస్క్ గా, ఫేషియల్స్ లోను ఉపయోగిస్తారు. నిమ్మకాయ, సిట్రస్ పండ్ల
జాతికి చెందుతుంది మరియు దీనివలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య
ప్రయోజనాలతోపాటు నిమ్మకాయ సౌందర్య ప్రయోజనాలను కూడా అందిస్తున్నది ఎందుకంటే
దీనిలో విటమిన్ సి,అనామ్లజనకాలు ఉన్నాయి.
నిమ్మ రసంతో 15 ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్:
నిమ్మకాయను సహజమైన చర్మ క్లీనర్ గా కూడా ఉపయోగించవచ్చు. నిమ్మకాయను,
తేనె వంటి సహజమైన గృహపదార్థాలతో, శనగపిండి, గుడ్డు, పెరుగు మొదలైన వాటితో
కలిపి వాడితే చర్మానికి లాభదాయకమైన ఫలితాలను అందిస్తుంది. కాబట్టి
నిమ్మకాయను ఇంట్లో వాడే ఫేస్ ప్యాక్లుగా ప్రయత్నించండి.

No comments:
Post a Comment