Friday, April 4, 2014

వెరైటీ దోసెలు

దోస(dosa)చాలా పాపులర్ అయినటువంటి సౌత్ ఇండియన్ ఫుడ్. ప్రస్తుతం ఈ దోసె ఇండియా మొత్తం పాపులర్ అయ్యింది. ఫుడ్ లవర్స్ లో మీరు ఒక్కరైతే, డిఫరెంట్ వెరైటీ దోసలను రుచిచూడాలనుకుంటే, మీకు సంతోషకరమైన విషయం ఏంటే మీకు చాలా ఆప్షన్సే ఉన్నాయి. వంటలు అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ఫుడ్ లవర్స్ కు ఈ ట్రెడిషనల్ రిసిపి చాలా ఎక్కువగా నచ్చుతుంది. దోస వివిధ రకాల వంటలను ఆఫర్ చేస్తుంది. వాటిలో ఒకదానికొకటి పూర్తి విభిన్నంగా ఉంటాయి. ఒక్కో రకమైన దోసెలో ఒక్క విధమైన ఫ్లేవర్ మరియు రుచి మరియు రంగు కూడా కలిగి ఉంటుంది. కుక్కింగ్ ఎక్స్ పర్ట్స్(వంటల్లో ఆరితేరిన వారు)ఒక దోసెలోనే 100రకాల వెరైటీ దోసెలున్నాయని చెబుతారు. వెరైటీ దోసెలను తయారుచేయడానికి తయారుచేసుకొనే పదార్థాల్లో కొంచెం వ్యత్యాసం ఉంటుంది.

వంటల్లో వివిధ రకాల వినూత్నమైన వంటలను ఎంపిక చేసుకొనే వ్యక్తులు ఎల్లప్పుడూ, వంటల్లో కొత్తవంటలు, కొత్త పద్దతులను ఆసక్తి కరంగా తెలుసుకోవడాని ఉత్సాహం చూపెడుతారు. కాబట్టి సాధారణంగా మనం తయారుచేసుకోగల కొన్ని కామన్ వెరైటీ దోసెలను మీకోసం ఇక్కడ పరిచయం చేస్తున్నాం...

No comments:

Post a Comment