Monday, May 19, 2014

సెక్స్‌కు దూరంగా ఉన్నారంటే..

శృంగారానికి కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వచ్చిందా? ఆ సమయంలో మీలో కామవాంఛలు పెచ్చరిల్లలేదా? ఒకవేళ కలిగితే మీ శరీరంలో ఎటువంటి మార్పులు
చోటుచేసుకున్నాయి? సెక్స్ లేకపోయినా ఉండగలమని అనుకుంటున్నారా? అసలు సెక్స్ చేయకపోతే నష్టం ఏమైనా ఉన్నదా? వంటి ప్రశ్నలు చాలా మంది ఉదయిస్తాయి.
తమలో ఉదయించే ప్రశ్నలకు జవాబులు పొందడానికి ఇతరులను అడిగి తెలుసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. అసలు సెక్స్ అవసరం గురించి పరస్పరం చర్చించుకునేందుకే ఇష్టపడరు. అయితే మనిషి మనిషికి సెక్సుకు సంబంధించిన కోర్కెలు భిన్నమైనవిగా ఉంటాయి.
సెక్స్ అనేది శరీరానికి కావలసిన అవసరం. అయితే, తీవ్రమైన పని ఒత్తిడి ఉండడం వల్ల కొన్నిసార్లు దృష్టంతా అటువైపు ఉండడం వల్ల కామవాంఛలు కలగకపోవచ్చు. కానీ, సాధారణంగా ఏదో సమయంలో అటువంటి కోరిక బుసలు కొడుతూనే ఉంటుంది. సెక్స్ కావాలని శరీరం వివిధ పద్ధతుల్లో చెబుతోంది.

No comments:

Post a Comment