ప్రతి సంవత్సరలో వచ్చే లాక్మే ఫ్యాషన్ వీక్ ఫ్యాషన్ క్యాలెండర్ లో ఒక పెద్ద
ఈవెంట్. ఈ ఫ్యాషన్ వీక్ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఎందుకంటే ఈ
ఫ్యాషన్ వీక్ కోసం చాలా మంది ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తుంటారు. వివిధ రకాల
డిజైన్లను కంపేర్ చేయడానికి, ఆకట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 మొదటి రోజున ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్
అద్భుతమైన ఓపెనింగ్ కలెక్షన్స్ తో మెస్మరైజ్ చేశారు. మనం ముందుగా
అనుకున్నట్లే అమిత్ అగర్వాల్ కలెక్షన్స్ లో సిల్హౌట్టే డిజైన్స్ ఎక్కువగా
కనబడుతాయనుకున్నాము.
కానీ ఈ సారి మాత్రం అతను డిజైన్ చేసిన కలెక్షన్స్ చాలా డిఫరెంట్ గా
ఉన్నాయి. వీటిలో దుస్తులను కాకుండా వాటి యొక్క స్ట్రక్చర్ ను మనం
గమనించవచ్చు, అలాగే యాక్ససరీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. లాక్మే
ఫ్యాషన్ వీక్ లో అమిత్ అగర్వాల్ ఉపయోగించిన యాక్ససెరీస్ 3డికి
సంబంధించినవి. వీటిలో నిజంగా బటర్ ఫ్లై ఇయర్ మఫ్స్ చాలా అందంగా
అలంకరించారు. ట్రైబల్ ట్రైబల్ ట్రెడిషన్ ను తలపిస్తుంది.
లాక్మే ష్యాషన్ వీక్ లో :సుస్మితా సేన్ స్టన్నింగ్ డ్రెస్:క్లిక్ చేయండి
అమిత్ అగర్వాల్ కలెక్షన్స్ లో ఎక్కువగా బ్లాక్ మరియు బ్లూ మరియు గ్రీన్
మెజారిటి ఎక్కువగా ఉంది. మిగిలిన సిల్హౌట్టే డ్రెస్సు కూడా అతని స్టైల్ కు
తగ్గట్లుగా డిజైన్ చేయబడింది . అలాగే ఫ్యాబ్రిక్స్ కూడా సిల్క్, టుల్లే,
మ్యాట్ సిల్క్ , క్రిప్ మరియు సాటిన్ ను ఎక్కువగా ఉపయోగించాడు . ఈ
మెటీరియల్స్ ట్రైబల్ ఫ్యాషన్ ను తలపిస్తున్నది.
అతని కలెక్షన్స్ లో వివిధ రకాల శారీ స్టైల్ గౌన్స్, ప్లగ్గింగ్ నెక్
లైన్స్, పెప్లమ్ ఫినిష్ మరియు స్ట్రక్చర్డ్ గౌన్స్ , షీర్ బాడీ సూట్స్ ,
మెష్ డీటైల్స్ అమిత్ కలెక్షన్స్ కు మరింత గ్లామర్ ను జోడించాయి. అయితే
మొత్తం అతని కలెక్షన్స్ లో షోస్టాపర్ గా సుస్మితా సేన్ ర్యాంప్ వాక్ లో
మెస్మరైజ్ చేసింది...
No comments:
Post a Comment