Wednesday, August 13, 2014

మీ దృష్టిని మరల్చండి ....

 సహజంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత టీనేజ్ లో ఉన్నప్పుడు, స్త్రీ, పురుషులు ప్రేమకు ఆకర్షితులవుతుంటారు. అయితే కొంత మంది ప్రేమను
తెలిపినప్పుడు వెంటనే స్పందిస్తారు, మరికొంత మంది కొంచెం నిధానంగా స్పందిస్తారు. కానీ కొంత మందికి అసలు ప్రేమంటనే పడదు, ప్రేమన్న, ప్రేమించడం అన్నా ఇష్టముండదు. అటువంటి వారికోసం ప్రేమలు పడకుండా ఉండటం కోసం కొన్ని చిట్కాలు ఈక్రింది విధంగా ఉన్నాయి. ఈ చిట్కాలను అనుసరించినట్లైతే, ముందు ముందు ప్రేమలో పడకుండా మీఅంతట మీరు కంట్రోల్లో ఉండటానికి ఇవి సహాయపడుతాయి. ఈ చిట్కాలను అనుసరించడానికి కొన్ని వారాలు పట్టినా, ఆ సమయంలో మాత్రం మీ ఆలోచనల్ని మరియు మీరు కూడా స్ట్రాంగ్ గా ఉండాలని నిర్ణయించుకోవాలి. మీకు ప్రేమను తెలిపే వారి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎవరితోనైనా ప్రేమలో పడకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా.

మీ దృష్టిని మరల్చండి: 
ప్ర్రేమను ఎక్స్ ప్రెస్ చేసే వ్యక్తి మీ మనస్సును కంట్రోల్ చేసే అవకాశం ఇవ్వకండి. అటువంటి వ్యక్తి గురించి ఆలోచనాలను ఆపడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి, మీ అంతట మీరు కొత్త పనులు ఏవైనా చేయడానికి వాటి మీద దృష్టి పెట్టండి. మరియు మీరు ఒంటరిగా లేదా ఖాళీగా ఉన్నట్లు అనుభూతి కలుగుతున్నా వేరే ఆలోచనల వల్ల మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోగలుగుతారు.

No comments:

Post a Comment