Friday, March 20, 2015

చికెన్ గీ రోస్ట్ రిసిపి: మంగళూరియన్ స్పెషల్

చికెన్ గీ రోస్ట్ సౌత్రన్ స్టేట్స్ లో చాలా పాపులర్ అయిన డిష్. ముఖ్యంగా ఇది మంగళూరియన్ స్పెషల్ డిష్ . కర్ణాటకాలోని మంగళూర్ కు దగ్గరగా ఉన్న కుందపూర్ లో ఈ డిష్ ను ఎక్కువగా తయారుచేస్తారు. చికెన్ గీ రోస్ట్
స్పైసీగా మరియు ట్యాంగీ టేస్ట్ కలిగి ఉంటుంది . మీ టేస్ట్ ను బట్టి, మసాలాలు ఎక్కువ, తక్కవుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు . ఈ మంగళూరియన్ స్పెషల్ చికెన్ రోస్ట్ బరువు తగ్గాలనుకొనే వారికి ఏమాత్రం సూట్ అవ్వదు. మాంసాహార ప్రియులు, చికెన్ అంటే ఎక్కువగా ఇష్టమున్న వారు ఇలా వెరైటీ డిష్ లను ట్రై చేయవచ్చు. ఘుమఘుమలాడే నెయ్యి, ఆరోమా వాసనతో మరియు చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఈ స్పెషల్ మంగళూరియన్ రిసిపిని
ఎలా తయారుచేయాలో చూద్దాం... 
కావల్సిన పదార్థాలు: చికెన్: 500gms 
కరివేపాకు: రెండు రెమ్మలు
 ధనియా (ధనియా పౌడర్): 2tsp 
కాశ్మీరీ కారం పొడి: 1tsp 
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp 
ఉప్పు: రుచికి సరిపడా 
పంచదార: 1tsp 
పెప్పర్ పొడి: 2tsp 
గరం మసాలా పొడి: 1tsp 
జీలకర్ర పొడి: 2 tsp 
ఎండు మిర్చి: 2
 నెయ్యి: 7tbsp + 2tsp
 కొత్తిమీర: 1/2cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి) 
చింతపండు గుజ్జు: 1tbsp
 టమోటో గుజ్జు: 1cup 
తయారుచేయు విధానం: 
1. ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యివేసి వేడయ్యాక అందులో కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం,వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. 
2. తర్వాత అందులో టమోటో గుజ్జు వేసి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 
3. 5 నిముషాల తర్వాత ధనియాలపొడి, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మసాల నుండి నెయ్యి సపరేట్ గా పైకి తేలే వరకూ ఫ్రై చేసుకోవాలి. 
4. ఇప్పుడు అందులోనే మరో రెండు చెంచాల నెయ్యి వేసి, చికెన్ ముక్కలు, ఉప్పు, గరం మసాలా మరియు పెప్పర్ పౌడర్ వేసి మరో 
5-10నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 6. ఇప్పుడు కొత్తిమీర సగభాగాన్ని ఉడుకుతున్న చికెన్ మీద చిలకరించుకోవాలి. అలాగే పంచదార కూడా చిలకరించి మూత పెట్టి తక్కువ మంట మీద 10 నిముషాలు ఉడికించుకవోాలి. 
6. 10నిముషాల తర్వాత మూత తీసి చింత పండు గుజ్జు వేసి మూత పెట్టి మరో 5నిముషాలు, చికెన్ మెత్తగా ఉడికే వరకూ ఉడికించుకవోాలి. 
7. చికెన్ ఉడికన తర్వాత స్టౌ ఆఫ్ చేసి మిగిలిన కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే చికెన్ గీ రోస్ట్ రెడీ . ఈ రుచికరమైన చికెన్ రిసిపిని దోసె మరియు చపాతీలతో సర్వ్ చేయాలి.

No comments:

Post a Comment