Saturday, April 25, 2015

మహిళలు బాడీ స్లిమ్ గా పొందడానికి...

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలికి తగ్గట్టుగానే విపరీతమైన బరువును భరిస్తూ... అందవిహీనంగా మారుతున్నారు. మళ్ళీ బరువు తగ్గాలంటూ ఎంతో కష్టపడతారు.
ప్రతిరోజూ వ్యాయామం, డైటింగ్ వంటివి చేస్తూనే ఉంటారు. కాని బరువు తగ్గటంలో ఫలితాలు తక్కువగానే ఉంటూ ఉంటాయి. కాని కొన్ని సార్లు వారికి తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతూంటాయి. సన్నగా కనబడడానికి చాలామంది టీనేజ్ మహిళలు పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. ఇన్ని తిప్పలు పడినా ఫలితం ఆవగింజలో అరభాగం కూడా వుండడంలేదు. వీరి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. స్లిమ్‌ గా మారేందుకు రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీని ప్రభావం కండరాల మీద పడుతుంది. చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు, ఎక్కువ దూరం నడవలేకపోవడం వంటివి బాధిస్తాయి. READ MORE: జిమ్ తో పొట్ట తగ్గదు... ఈ ఔషదాలతో పొట్ట మాయం... బాడీ స్లిమ్ సన్నగా, నాజూగ్గా కావాలని కోరుకునేవారు చాలామందే ఉంటారు. అయితే నలుగురూ లావుగా ఉన్నావంటూ వెక్కిరిస్తున్నారనే తొందరలో అప్పటికున్న ఆరోగ్య పరిస్థితులు, శారీరక, మానసిక సామర్థ్యాలను పట్టించుకోకుండా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు డైటింగ్‌ చేసేస్తే నాజూకుతనం మాట ఎలా ఉన్నా, ఉన్న ఆరోగ్యానికే ముప్పు ఏర్పడి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే డైటింగ్‌ చేయబోయే ముందు కొన్ని నియమ నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం.


No comments:

Post a Comment