Monday, July 27, 2015

హాట్ అండ్ సెక్సీగా యాంకర్

టీవీ షోలు, ఆడియో వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో యాంకర్ పాత్రకు పరిమితమైన అనసూయ..... స్టేజీ షోలలో డాన్సర్‌గానూ అదరగొడుతోంది. ఆ మధ్య దుబాయ్ లో జరిగిన ఓ వేడుకలో తొలిసారిగా
స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచిన అనసూయ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ‘సినీ‘మా' అవార్డ్స్' కార్యక్రమంలో హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అవకాశం వచ్చినప్పుడల్లా స్టేజీపై తన పెర్ఫార్మెన్స్ తో రెచ్చిపోయే దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన ఎనర్జీ చూపించారు. హీరోయిన్లు అంజలి, రెజీనా కాసాంద్ర, లక్ష్మీ రాయ్, రకుల్ ప్రీత్ సింగ్, అదా శర్మ, ముంబై డాన్సర్ లారెన్ గొట్టిబ్ తదితరులు సూపర్బ్ పరెర్పార్మెన్స్‌తో ఈ అవార్డుల కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ తన ఎనర్జిటిక్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ బలవంత పెట్టడంతో అల్లు అర్జున్ కూడా రెండు స్టెప్స్ వేసారు. ఈ అవార్డుల కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ, శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

No comments:

Post a Comment